ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల గుడిసెలు.. భారీగా పోలీసుల మోహరింపు.. టెన్షన్ వాతావరణం..

Published : Jul 15, 2023, 04:33 PM IST
ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల గుడిసెలు.. భారీగా పోలీసుల మోహరింపు.. టెన్షన్ వాతావరణం..

సారాంశం

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల సమీపంలోని భూదాన్ భూముల్లో పేద కుటుంబాలు గుడిసెలు వేసుకన్నాయి. గతంలో భూదాన్ బోర్డు తమకు భూమి కేటాయించిందని.. కానీ ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు తమకు ఇవ్వడం లేదని పేదలు చెబుతున్నారు.

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల సమీపంలోని భూదాన్ భూముల్లో పేద కుటుంబాలు గుడిసెలు వేసుకన్నాయి. గతంలో భూదాన్ బోర్డు తమకు భూమి కేటాయించిందని.. కానీ ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు తమకు ఇవ్వడం లేదని పేదలు చెబుతున్నారు. అందుకే ఈరోజు ఇక్కడ గుడిసెలు వేసుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు.. పేదల గుడిసెలను తొలగించేందుకు సిద్దం అయ్యారు. ఈ క్రమంలోనే పేదలు.. పోలీసులు, అధికారుల చర్యలను ప్రతిఘటించారు. కర్రెలు చేతపట్టి ఆందోళనకు దిగారు. 

ఈ క్రమంలోనే అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు  చోటుచేసుకుండా భారీగా పోలీసులను మోహరించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు ఈ భూములు కబ్జా చేశారని పేదలు ఆరోపిస్తున్నారు. అందుకే తాము ఇక్కడ గుడిసెలు వేసుకున్నామని చెప్పుకొస్తున్నారు. సివిల్ మ్యాటర్‌‌లోకి పోలీసులు ఇన్వాల్వ్ కావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా