శామీర్‌పేట్ కాల్పుల కేసులో మరో కోణం : అందమైన అమ్మాయిలు ట్రాప్ ..వెలుగులోకి మనోజ్, స్మితల బాగోతాలు

Siva Kodati |  
Published : Jul 15, 2023, 04:07 PM ISTUpdated : Jul 15, 2023, 05:34 PM IST
శామీర్‌పేట్ కాల్పుల కేసులో మరో కోణం : అందమైన అమ్మాయిలు ట్రాప్ ..వెలుగులోకి మనోజ్, స్మితల బాగోతాలు

సారాంశం

శామీర్‌పేట్ కాల్పుల కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యాక్టింగ్ పేరుతో అందమైన అమ్మాయిలను వీరు ట్రాప్ చేస్తున్నట్లుగా గుర్తించారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శామీర్‌పేట్ కాల్పుల కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనోజ్, స్మితలు మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. యాక్టింగ్ పేరుతో అందమైన అమ్మాయిలను వీరు ట్రాప్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇటీవలే ఓ సంపన్న యువతిని ట్రాప్ వీరు ట్రాప్ చేసి.. రూ.50 లక్షలు వసూలు చేశారు. ఒరాకిల్ కంపెనీలో ఉద్యోగిగా వుంటూనే స్మిత మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మనోజ్, స్మితల అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది. 

అయితే భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో స్మిత పిల్లలతో పాటు భర్తకు దూరంగా ఉంటుంది. మరో వ్యక్తితో ఆమె సహజీనం చేస్తున్నారు. సిద్దార్థ్ దాస్‌, స్మితలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కొడుకు, కూతురు ఉన్నారు. అయితే 2019లో  విభేదాలతో భర్తకు స్మిత దూరమయ్యారు. అయితే స్మిత మనోజ్‌కుమార్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. వారు ప్రస్తుతం సెలబ్రిటీ రిసార్ట్‌లోని ఓ విల్లాలో నివాసం ఉంటున్నారు. అయితే పిల్లలను కూడా స్మిత తన వద్దే ఉంచుకుంది. 

Also Read: భర్తతో విభేదాలు.. మరో వ్యక్తితో సహజీవనం.. పిల్లల విషయంలో.. : శామీర్‌పేట కాల్పుల ఘటనలో ట్విస్ట్

సిద్దార్థ్ దాస్ పిల్లలను చూసుకునేందుకు స్మితా ఉంటున్న విల్లాకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ జరిగిన ఘర్షణలో మనోజ్ కుమార్ ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ విషయంపై సిద్దార్థ్ దాస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, అది ఎయిర్‌గన్‌ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. ఇక, పిల్లలను మనోజ్ కొడుతున్నట్టుగా సిద్దార్థ్ దాస్ ఆరోపిస్తున్నారు. అయితే స్మితా మాత్రం అలాంటిదేమి లేదని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. 

ఇదిలాఉంటే, ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సిదార్థ్-స్మితాల కొడుకు లేఖ రాశాడు. అందులో మనోజ్‌ తమతో పనులు చేయించడంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇటీవల సిదార్థ్-స్మితాల కొడుకును వారి సంరక్షణలో ఉంచింది. అయితే తనతో పాటు చెల్లిని కూడా మనోజ్ కొడుతున్నాడని.. సీడబ్ల్యూసీతోపాటు, తన తండ్రి సిద్దార్థ్ దాస్‌కు చెప్పాడు. ఈ క్రమంలోనే సిద్దార్థ్ దాస్ విశాఖ నుంచి శామీర్‌పేట్‌కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మనోజ్ అతనిపై కాల్పులు జరిపాడు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?