హైదరాబాద్ ఓటర్లు మందకొడిగా ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అతితక్కువ పోలింగ్ నమోదయ్యింది. వరుసగా సెలవులు రావడంతో ఓటింగ్ ప్రభావితం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఇప్పటివరకు హైదరాబాద్ లో అతి తక్కువ పోలింగ్ నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతీసారి హైదరాబాద్ లోనే తక్కువగా పోలింగ్ నమోదవుతుంది. ఈ సారి కూడా హైదరాబాదులో పోలింగ్ మందకోడిగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల సమయంలో ఎక్కువగా కనిపించిన ఓటర్లు ఆ తరువాత పలుచబడ్డారు. మొదటి రెండు గంటల్లో హైదరాబాద్ లో 4.57 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది.
హైదరాబాద్ లో అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం
సనత్ నగర్ లో 0.2 శాతం
కూకట్పల్లిలో 1.9 శాతం
మేడ్చల్లో 2 శాతం
గోషామహల్ లో 2 శాతం
చార్మినార్లో 3 శాతం
ముషీరాబాద్ లో 4 శాతం
రాజేంద్రనగర్ లో అత్యధికంగా 15 శాతం పోలింగ్ నమోదయ్యింది.
Telangana polls : తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఇది...