వరుస చైన్ స్నాచింగ్ లు.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను నేడు హైదరాబాద్ తీసుకురానున్న పోలీసులు...

By SumaBala BukkaFirst Published Jan 24, 2022, 11:43 AM IST
Highlights

ర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వరుసగా ఉమేష్ పై కేసులు ఉన్నాయి. నిందితుడు Ahmedabad Crime Branchకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. నిందితుడు ఉమేష్ ను సోమవారం పిటీ వారింట్ పై హైదరాబాద్కు తీసుకురానున్నారు. ఈ నెలలో మూడు Commissionerates పరిధిలో గంట వ్యవధిలో 6 స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. 

హైదరాబాద్ :   wanted criminal చైన్ స్నాచర్ ఉమేష్ ను సోమవారం పోలీసులు హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ప్రస్తుతం chain snatcher అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వరుసగా ఉమేష్ పై కేసులు ఉన్నాయి. నిందితుడు Ahmedabad Crime Branchకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. నిందితుడు ఉమేష్ ను సోమవారం పిటీ వారింట్ పై హైదరాబాద్కు తీసుకురానున్నారు. 

ఈ నెలలో మూడు Commissionerates పరిధిలో గంట వ్యవధిలో 6 స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో నిందితుడు ని గుర్తించి పట్టుకున్నారు. చైన్ స్నాచింగ్ తెగబడుతున్న నిందితుడి ఆటకట్టించారు పోలీసులు. గంట వ్యవధిలోనే ఆరు చోట్ల చైన్ స్నాచింగ్ చేసి పోలీసులకు సవాల్ విసిరాడు. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఒకే రోజు గంటల వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగ్ లకు పాల్పడి నగరవాసులను హడలెత్తించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా చైన్ స్నాచర్ ను గుర్తించిన పోలీసులు.. నిందితుడు గుజరాత్ కు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసుల సాయంతో నిందితుడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా ఈ నెల 19న వరుసగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన నిందితుడిని రాజస్థాన్కు చెందిన ఉమేష్ ఖతిక్ గా గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు ఫోటోను కూడా జనవరి 22 న విడుదల చేశారు.  గుజరాత్, మహారాష్ట్రలో కూడా  ఉమేష్ కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.  ఈ క్రమంలోనే గుజరాత్లోని అహ్మదాబాద్ లో నిందితుడు ఉమేష్ ఖతిక్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈనెల 18న హైదరాబాద్కు వచ్చిన  ఉమేష్..  ఆ మరుసటి రోజు  చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. అనంతరం అతడు వరంగల్ వెళ్లి అక్కడ  నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం 10 గంటలకు నిందితుడు దొంగతనాలు మొదలుపెట్టి.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించాడు. ఈ సమయంలో ఐదుగురి మెడలో నుండి  బంగారు గొలుసులు  లాక్కెళ్లాడు.  ఆరోసారి కూడా ప్రయత్నించినా విఫలమయ్యాడు.  

ఆ దొంగ మొదట దొంగిలించిన బైక్ తో మారేడ్పల్లి, తుకారం గేట్,  పేట్ బషీరాబాద్,  మేడిపల్లి ప్రాంతాల్లో దొంగతనం చేశాడు. ఈ సమయంలో అతడు క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. సంజీవయ్య నగర్ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల విజయ తన కూతుర్ని కలవడానికి సమీపంలోని నర్సింగ్ హోమ్ కి వెళ్ళింది. ఇంటికి తిరిగి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో ఇంద్రపురి రైల్వే కాలనీ వద్దకు చేరుకోగానే ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. ఈ సమయంలో ఆమె కింద పడి, గాయాలయ్యాయి.

మారేడుపల్లి లో దొంగతనం చేసిన తర్వాత.. పక్కనే ఉన్న తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రవేశించాడు. ఈసారి అతను 65 ఏళ్ల రాంబాయిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆమె రోడ్డు పక్కన నడుస్తున్న సమయంలో ఎదురుగా బైక్ పై వచ్చిన దొంగ మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెల్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి సైబరాబాద్ లోకి ప్రవేశించి రెండు స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. మరో గంటలో ఇంకో దొంగతనం చేయడానికి ప్రయత్నించినా అది విఫలం అయింది .ఈ మేరకు తుకారం గేట్, మారేడ్పల్లి లో పోలీసులు విచారణ ప్రారంభించారు ,

పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఈ దొంగతనాలకు నిందితుడు ఒకే బైక్ ను ఉపయోగించినట్లు నిర్ధారించుకున్నారు. అయితే ఆ బైక్ ను నిందితుడు దొంగిలించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.  
 

click me!