భర్త స్నేహితుడు, మరో ఇద్దరితో మహిళ సంబంధం.. రోకలిబండతో కొట్టి, దుప్పట్లో చుట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పడేసి..

Published : Jan 05, 2022, 01:03 PM IST
భర్త స్నేహితుడు, మరో ఇద్దరితో మహిళ సంబంధం.. రోకలిబండతో కొట్టి, దుప్పట్లో చుట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పడేసి..

సారాంశం

ఫిలింనగర్ కు చెందిన ఎ. సాయికుమార్ అలియాస్ రాజ్ కుమార్ (22)తో షేర్ చాట్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడి Extramarital affairకి దారితీసింది. గత అక్జోబర్ లో వనస్థలిపురం కమలానగర్ కాలనీకి ప్రియాంక మకాం మార్చింది. సాయికుమార్ తో పాటు మరో వ్యక్తితో ప్రియాంక సంబంధం పెట్టుకుంది. ఇదిలా ఉండగా, రెండో భర్త స్నేహితుడు సూర్యాపేటకు చెందిన గుడిపాటి శ్రీనివాస్ (32) ఆమె యోగక్షేమాలు చూసేవాడు. 

హైదరాబాద్ : గుర్తు తెలియని వ్యక్తిని murder చేసి, దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన కేసును వనస్థలిపురం పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్దరినీ arrest చేసి Remand కు తరలించారు. హతుడి జేబులో లభించిన ఓ 
ATM card నిందితులను పట్టించిందని పోలీసులు తెలిపారు. 

మంగళవారం వనస్థలిపురం ఇన్స్ పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన కె. ప్రియాంక, అలియాస్ దీప్తీ (27)కి పెళ్లి కాగా, భర్తకు విడాకులు ఇచ్చి ఉదయ్ కుమార్ అనే వ్యక్తిని Second marriage చేసుకుంది. అతను గతేడాది Coronaతో మృతి చెందాడు. 

దీంతో ప్రియాంక మిర్యాలగూడలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో ఫిలింనగర్ కు చెందిన ఎ. సాయికుమార్ అలియాస్ రాజ్ కుమార్ (22)తో షేర్ చాట్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడి Extramarital affairకి దారితీసింది. గత అక్జోబర్ లో వనస్థలిపురం కమలానగర్ కాలనీకి ప్రియాంక మకాం మార్చింది. సాయికుమార్ తో పాటు మరో వ్యక్తితో ప్రియాంక సంబంధం పెట్టుకుంది. ఇదిలా ఉండగా, రెండో భర్త స్నేహితుడు సూర్యాపేటకు చెందిన గుడిపాటి శ్రీనివాస్ (32) ఆమె యోగక్షేమాలు చూసేవాడు. 

గత డిసెంబ్ 10న శ్రీనివాస్.. ప్రియాంక ఇంటికి రాగా, సాయికుమార్ కనిపించాడు దీంతో ఇద్దరితో ఎలా సంబంధం కొనసాగిస్తున్నావని నిలదీశాడు. ఇరువురి మధ్య గొడవ పెరగడంతో సాయికుమార్ ఇంట్లో ఉన్న రోకలిబండతో శ్రీనివాస్ తలమీద బలంగా కొట్టడంతో చనిపోయాడు. ఈ విషయాన్ని ప్రియాంక తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తికి ఫోన్ లో చెప్పింది. 

Minor Girl Rape case: హైద‌రాబాద్‌లో దారుణం.. బాలికపై అత్యాచారం ఆపై.. బ‌ల‌వంతంగా వ్య‌భిచారం

అతడి సలహా మేరకు శ్రీనివాస్ మృతదేహాన్ని దుప్పట్లో మూటగట్టి అదే రోజు రాత్రి బైక్ మీద విజయపురి కాలనీ బస్టాప్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించకుండా జాగ్రత్త పడ్డ నిందితులు మృతుడి జేబులో ఉన్న ఏటీఎం కార్డును మాత్రం గుర్తించలేదు. పోలీసులకు ఈ కార్డు లభించింది. దీని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులు సాయికుమార్, ప్రియాంకలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

ఇదిలా ఉండగా, హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో  గొడ‌వ ప‌డి అర్థ‌రాత్రి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఒక బాలికపై కొంద‌రు దాడి చేశారు. అంతే కాకుండా ఆ బాలికపై అత్యాచారం చేశారు. వీటితో ఆగ‌కుండా ఆ బాలిక‌ను వ్య‌భిచార కూపీలోకి దించారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని పాతబ‌స్తీలో చోటు చేసుకుంది.

హైద‌రాబాద్ లోని పాత బ‌స్తీ కిష‌న్ బాగ్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక త‌న ఇంట్లో వాళ్లో గొడ‌వప‌డి న‌వంబ‌ర్ 20 న బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌దిరోజుల పాటు ఆ బాలిక కోసం వెతికి చివ‌ర‌కు డిసెంబర్ 1వ తేదీ బాధిత బాలిక తల్లి బహదూర్ పురా పోలీసులను ఆశ్ర‌యించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. చివ‌రికి ఓ ఇంటిపై దాడి చేయ‌గా.. బాలిక దొరికింది. అయితే.. ఆమెను ప్ర‌శ్నించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్