హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఒకే రోజు రెండు చోట్ల బంగారు గొలుసులు చోరీ

Published : Jan 05, 2022, 11:38 AM ISTUpdated : Jan 05, 2022, 11:42 AM IST
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఒకే రోజు రెండు చోట్ల బంగారు గొలుసులు చోరీ

సారాంశం

హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల చైన్ స్నాచింగ్ (chain snatching) ఘటనలు చోటుచేసుకున్నాయి. కేపీహెచ్‌బీలో మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారం లాక్కెళ్లారు దుండగులు. మరోవైపు చింతల్‌లో మహిళ మెడలో నుంచి 2.5 తులాల బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లారు. 

హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల చైన్ స్నాచింగ్ (chain snatching) ఘటనలు చోటుచేసుకున్నాయి. కేపీహెచ్‌బీలో మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారం లాక్కెళ్లారు దుండగులు. మరోవైపు చింతల్‌లో మహిళ మెడలో నుంచి 2.5 తులాల బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లారు. అయితే హైదరాబాద్‌లో మూడు రోజుల వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగ్‌లు జరగడంతో.. నగరవాసులు భయాందోళన చెందతున్నారు.  

కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 2లోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన దొంగ.. పద్మజా రెడ్డి అనే మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కుని వెళ్లిపోయాడు. నాలుగు తులాల బంగారు చైన్ దొంగిలించినట్టుగా బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ప్రాంతంలో దొంగ తిరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టనున్నారు. 

చింతల్ మహేంద్ర నగర్‌లో లత అనే మహిళకు చెందిన 2.5 తులాల బంగారు గొలుసు చోరీకి గురైంది. లత రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. దుండగుడు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. స్కూటీపై వచ్చిన దుండగడులు ఈ నేరానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీందతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇక, తెలంగాణ రాష్ట్రంలో 2020తో పోలిస్తే 2021లో నేరాలు పెరిగాయి. నేరాల పెరుగుదల 4.6శాతంగా నమోదైంది. సైబర్‌నేరాలు అనూహ్యంగా నాలుగు రెట్లు పైకి ఎగబాకాయి. వివిధ నేరాలకు సంబంధించి 2020లో మొ త్తం 1,35,537 నమోదవగా 2021లో మొత్తం కేసుల సంఖ్య 1,32,906గా నమోదైంది. 2021లో 838 హత్య కేసులు, 1,218 కిడ్నాప్, 2,382 రేప్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి వార్షిక నేర నివేది క–2021ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్