పంతంగి టోల్ ప్లాజా వద్ద మూడున్నర కిలోల బంగారం స్వాధీనం:పోలీసుల అదుపులో ముగ్గురు

By narsimha lode  |  First Published Oct 30, 2022, 10:14 AM IST

యాదాద్రి  భువనగిరి  జిల్లాలోని  పంతంగి  టోల్ ప్లాజా  వద్ద   ఆదివారం నాడు  ఉదయం  ముూడున్నర  కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్  చేశారు. ఈ బంగారాన్ి  తరలిస్తున్న  ముగ్గురిని  పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


నల్గొండ: యాదాద్రి  భువనగిరి  జిల్లాలోని  చౌటుప్పల్ మండలం  పంతంగి టోల్  ప్లాజా వద్ద మూడున్నర కిలోల  బంగారాన్ని  పోలీసులు  ఆదివారం  నాడు  స్వాధీనం చేసుకున్నారు.సుల్తానా, జావీద్,షరీఫ్  లను  పోలీసులు   అదుపులోకి  తీసుకున్నారు. ఈ  ముగ్గురు  కారులో  తరలిస్తున్న  బంగారానికి సరైన  పత్రాలు లేకపోవడంతో  పోలీసులు  సీజ్ చేశారు.

మునుగోడు  అసెంబ్లీ స్థానానిక  జరుగుతున్న  ఉప  ఎన్నికను పురస్కరించుకొని   యాదాద్రి,నల్గొండ,సూర్యాపేట జిల్లాల  సరిహద్దుల  వద్ద  చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ చెక్ పోస్టుల  గుండా  వెళ్లే  వాహనాలను  పోలీసులు తనిఖీ  చేస్తున్నారు. ఇవాళ ఉదయం  విజయవాడ నుండి కారులో  మూడున్నర కిలోల  బంగారాన్ని తరలిస్తుండగా  వాహనాల  తనిఖీలో  బయటపడింది. కారులో  బంగారాన్ని  తరలిస్తున్న  ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని  ప్రశ్నిస్తున్నారు. 

Latest Videos

విజయవాడ  నుండి  హైద్రాబాద్ కు  ఈ బంగారాన్ని  తరలిస్తున్నట్టుగా  కారులోని  ముగ్గురు  వ్యక్తులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  అయితే ఈ బంగారాన్ని హైద్రాబాద్ లో  ఎక్కడికి తరలిస్తున్నారనే  విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

రెండు  తెలుగు  రాష్ట్రాలతో  పాటు  దేశంలోని పలు  చోట్ల  కూడ బంగారం  తరలిస్తూ పట్టుబడిన  ఉదంతాలు  గతంలో చోటు చేసుకున్నాయి. హైద్రాబాద్  నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి రూ. 2.58 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఈ  నెల 6వన తేదీనసీజ్ చేశారు.

దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి లగేజీని స్కాన్ చేసిన అధికారులు  బంగారాన్ని గుర్తించారు.  
ఈ ఏడాది సెప్టెంబర్ 15న  దుబాయి  నుండి వచ్చిన ప్రయాణీకురాలి నుండి  268 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ. 14లక్షలుంటుందని అధికారులు అంచనా వేశారు.

ఈఏడాది జూలై 23న దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుల నుండి  4 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజీ చేశారు. షూ సాక్స్ లో బంగారం దాచుకుని  తరలిస్తుండగా  కస్టమ్స్  అధికారులు  సీజ్ చేశార.. మరొకరు తాను ధరించిన దుస్తుల్లో ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన జేబులో బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఏడాది ఆగస్టు 12న  శంషాబాద్  ఎయిర్ పోర్టులో ప్రయాణీకుడి నుండి బంగారం సీజ్ చేశారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి షూలో దాచుకొని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 
 

click me!