నిజామాబాద్ లో అమానుషం ... తల్లితో సహజీవనం చేస్తూ ఆరేళ్ల కూతురిపై హత్యాచారం

Published : Oct 30, 2022, 09:07 AM IST
నిజామాబాద్ లో అమానుషం ... తల్లితో సహజీవనం చేస్తూ ఆరేళ్ల కూతురిపై హత్యాచారం

సారాంశం

నిజామాబాద్ అమానుష ఘటన వెలుగుచూసింది. ఒంటరి మహిళతో సహజీవనం చేస్తూ ఆమె ఆరేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడి ప్రాణాలు తీసాడో కామాంధుడు..  

నిజామాబాద్ : తల్లితో సహజీవనం చేస్తూ ఆమె ఆరేళ్ల కూతురిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. తండ్రిలా చూసుకోవాల్సినవాడు కామంతో రగిలిపోతూ ముక్కుపచ్చలారని చిన్నారితో పశువులా వ్యవహరించి ప్రాణాలనే బలితీసుకున్నాడు. ఈ విషయం భయటపడకుండా బాలికది సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా అతడి పాపం పండి బయటపడింది. ఈ అమానుషం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ భర్తను కోల్పోయి ఆరేళ్ల కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న ఆమె మరికొందరు కూలీలతో కలిసి ఇటీవల డిచ్ పల్లి మండలంలోని ఓ గ్రామానికి వెళ్లారు. ఈ సమయంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళపై గోవింద్ రావు అనే దుర్మార్గుడి కన్నుపడింది. మాయమాటలతో మహిళను లోబర్చుకున్న అతడు సహజీవనం చేయసాగాడు. ఇలా తల్లీ, ఆరేళ్ల చిన్నారి కూడా అతడితో కలిసుండేవారు. 

అయితే ప్రతిరోజూ మహిళ కూలీపనుల కోసం వెళ్లగా చిన్నారి ఒంటరిగా వుండేది. దీంతో ఆ చిన్నారిపై గోవింద్ రావు కన్నుపడింది. అభం శుభం తెలియని బాలికను ఈ నెల 20 తేదీన అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ లైంగికదాడితో తీవ్ర అస్వస్థతకు గురయిన చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో గోవింద్ రావు మెల్లిగా అక్కడినుండి జారుకున్నాడు. 

Read More 12 ఏళ్ల బాలికపై మైనర్ బాలుర గ్యాంగ్ రేప్.. ఫోన్లో చిత్రీకరణ..డబ్బుల కోసం బ్లాక్ మెయిల్..సోషల్ మీడియాలో పోస్ట్

తల్లి ఇంటికి వచ్చేసరికి కూతురు స్పృహతప్పి పడివుండటాన్ని చూసి కంగారుపడి నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా వుండటంతో హైదరాబాద్ నీలోఫర్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో ప్రియుడు గోవింద్ రావుతో కలిసి కూతురిని తీసుకుని హైదరాబాద్ కు వెళ్లింది. అక్కడ చికిత్సపొందుతూ బాలిక మృతిచెందింది. 

బాలిక మృతదేహానికి పోస్టుమార్టం జరిగితే అత్యాచారం విషయం బయటపడుతుందని గోవింద్ రావు తెలుసుకున్నాడు. దీంతో బాలిక తల్లిని ఒప్పించి సహజ మరణమేనని చెప్పి మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే హాస్పిటల్ సిబ్బంది డిచ్ పల్లి పోలీసులకు సమాచారం అందించగా వారు బాలిక మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో బాలికపై అత్యాచారం జరిగినట్లు బయటపడింది. 

 పోలీసులు బాలిక తల్లితో పాటు ఆమె సహజీవనం చేస్తున్న గోవింద్ రావు ను విచారించగా అసలు నిజం బయటపడింది. బాలికపై తానే అత్యాచారానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో ఫోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు పోలీసులు. 
 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu