తెలంగాణ రాజకీయాలను చూస్తే అసహ్యం వేస్తుంది: రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న జానారెడ్డి

By narsimha lode  |  First Published Oct 30, 2022, 9:43 AM IST

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్  పార్టీ  సీనియర్ నేత  జానారెడ్డి  ఆదివారం నాడు  పాల్గొన్నారు. రాహుల్  గాంధీతో కలిసి  జానారెడ్డి  పాదయాత్ర  చేశారు. 


మహబూబ్‌నగర్: ప్రస్తుతం తెలంగాణ  రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను చూస్తే  అసహ్యం వేస్తుందని మాజీ మంత్రి , కాంగ్రెస్  పార్టీ  నేత  కుందూరు జానారెడ్డి  చెప్పారు. 

రాహుల్  గాంధీ నిర్వహిస్తున్న  భారత్ జోడో యాత్రలో జానారెడ్డి  ఆదివారం నాడు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాతో  మాట్లాడారు.ఈ తరహ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మొయినాబాద్ ఫాంహౌస్  ఘటనపై జానారెడ్డి  ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రజల సమస్యల  పరిష్కారం  కోసం  రాహుల్  గాంధీ  నిర్వహిస్తున్న పాదయాత్ర  దోహదపడుతుందన్నారు. భారత్ జోడో యాత్ర  కాంగ్రెస్ పార్టీ  నాయకుల్ని ఏకం చేస్తుందన్నారు.తమ  పార్టీ నేతల  మధ్య ఉన్న  అభిప్రాయ బేధాలు  కొంతవరకే అని ఆయన  చెప్పారు.కానీ నాయకుల మధ్య  విబేధాల గురించి ఊహించుకోవడం  ఎక్కువగా  ఉంటుందన్నారు.ప్రజలు  కాంగ్రెస్  పార్టీ వైపే  ఉన్నారని ఆయన  చెప్పారు. వచ్చే  ఎన్నికల్లో  తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాను  వ్యక్తం చేశారు.

Latest Videos


ఐదో  రోజూ తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, షాద్  నగర్ నియోజకవర్గాల్లో ఇవాళ రాహుల్  గాంధీ పాదయాత్ర సాగనుంది. షాద్  నగర్ మండలం సోలీపూర్ జంక్షన్ వరకు రాహుల్ పాదయాత్ర  నిర్వహిస్తారు. ఇవాళ 22 కి.మీ పాదయాత్ర నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ..బాలానగ,ర్ మండలం పెద్దాయిపల్లిలో  లంచ్ బ్రేక్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఐదు  రోజులుగా  పాదయాత్ర  నిర్వహిస్తున్నారు.  ఈ నెల  23న కర్ణాటక  రాష్ట్రం  నుండి పాదయాత్ర  తెలంగాణ రాష్ట్రంలోకి  ప్రవేశించింది. అదే రోజు నాలుగు కి.మీ పాదయాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ  దీపావళిని  పురస్కరించుకొని యాత్రకు  మూడు రోజులు  బ్రేక్  ఇచ్చారు. ఈ నెల  24, 25, 26 తేదీల్లో యాత్రకు  విరామం ప్రకటించారు.ఈ 27  నుండి రాహుల్ గాంధీ తన పాదయాత్రను  పున: ప్రారంభించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ  తేదీన తమిళనాడు  రాష్ట్రంలోని  కన్యాకుమారిలో రాహుల్ గాంధీ  పాదయాత్రను  ప్రారంభించారు. తమిళనాడు,కేరళ , ఏపీ ,కర్ణాటక రాష్ట్రాల మీదుగా  తెలంగాణ రాష్ట్రంలోకి  రాహుల్  గాంధీ పాదయాత్ర  ప్రవేశించింది. తెలంగాణ రాష్ట్రంలో  15  రోజుల పాటు   పాదయాత్ర  సాగుతుంది. తెలంగాణ  నుండి  మహారాష్ట్రలో  రాహుల్  గాంధీ పాదయాత్ర  ప్రవేశించనుంది.

 

click me!