హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు పట్టివేత.. లెక్కల్లో చూపని రూ. 89.92 లక్షలు స్వాధీనం

Published : Oct 31, 2022, 11:11 AM IST
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు పట్టివేత.. లెక్కల్లో చూపని రూ. 89.92 లక్షలు స్వాధీనం

సారాంశం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు పట్టుబడింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని రోడ్డు నెంబర్ 71లో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు కారులో తరలిస్తున్న లెక్కల్లో చూపని రూ. 89.92 లక్షల రూపాయలను పట్టుకున్నారు. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు పట్టుబడింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని రోడ్డు నెంబర్ 71లో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు కారులో తరలిస్తున్న లెక్కల్లో చూపని రూ. 89.92 లక్షల రూపాయలను పట్టుకున్నారు. వివరాలు.. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం రాత్రి.. టీఎస్ 27 డీ 7777 నెంబర్ ప్లేట్ కలిగిన మహీంద్రా థార్ వాహనం తనిఖీలు నిర్వహించారు. అందులో లెక్కల్లో చూపని రూ. 89. 92 లక్షల నగదును గుర్తించారు. నగదు సంబంధించి ఎలాంటి వివరాలు, పత్రాలు సమర్పించకపోవడంతో సీజ్ చేశారు. కారులో ఉన్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

అనంతరం కారులో స్వాధీనం చేసుకన్న నగదును, అదుపులోకి తీసుకున్న వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్.. జూబ్లీహిల్స్  పోలీసులకు అప్పగించింది. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం రాత్రి 11 గంటలకు టాస్క్‌ఫోర్స్ బృందం తమకు సమాచారం అందించిందని తెలిపారు. మహీంద్రా థార్ వాహనంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు లెక్కల్లో చూపని రూ.  82,92,000  నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 

Also Read: తెలంగాణలో ఆరో రోజు రాహుల్ గాంధీ భారత్ జడో యాత్ర.. మధ్యాహ్నం కొత్తూరులో ప్రెస్ మీట్..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌