పూనమ్ చేతిని రాహుల్ కావాలని పట్టుకోలేదు.. పార్టీలో నాయకులను బతిమాలుకునే పరిస్థితి ఇప్పుడు లేదు: కొండా సురేఖ

By Sumanth KanukulaFirst Published Oct 31, 2022, 10:46 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీలో గతంలో మాదిరిగా పార్టీ నాయకులను బతిమాలుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం నింపుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీలో గతంలో మాదిరిగా పార్టీ నాయకులను బతిమాలుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణలో ఇంతకుమందు ఇబ్బందికర పరిస్థితులు ఉండేవని అంగీకరించిన కొండా సురేఖ.. రాహుల్ గాంధీతో మీటింగ్ జరిగిన తర్వాత ఆ పరిస్థితులు లేవని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంలో అధిష్టానం వెంటనే షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో ఈ విధంగా జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర జరుగుతున్న చోటు నుంచి ఆమె ఓ న్యూస్‌ చానల్‌తో మాట్లాడారు. 

ఈ క్రమంలోనే ఇటీవల పాదయాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్ చేతిని రాహుల్ పట్టుకుని ఉన్న ఫొటోపై జరుగుతున్న రచ్చపై కూడా కొండా సురేఖ స్పందించారు. పూనమ్ కౌర్ చేతిని రాహుల్ గాంధీ కావాలని పట్టుకోలేదని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారనేది చూడాలని.. విమర్శలు చేసేవారు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. వేరే ఉద్దేశంతో పబ్లిక్‌లో ఎవరైనా అమ్మాయి చేయి పట్టుకుంటారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్లను తల్లిగా చూస్తుందన్నారు. పార్టీ క్యాండెట్ కోసమే క్యాడర్ పనిచేస్తుందని.. అధిష్టానం డిక్లేర్ చేసినవాళ్లనే గెలిపించుకుంటామని చెప్పారు. 

Also Read: ఇది మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్టుగా ఉంది.. రాహుల్‌తో ఫొటోపై ట్రోలింగ్‌కు పూనమ్ కౌర్ కౌంటర్..

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం నింపుతుందని కొండా సురేఖ అన్నారు. ఈ యాత్రతో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి పునరుత్తేజం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

click me!