హయత్‌నగర్‌లో బాలికపై అత్యాచారం జరగలేదు.. నిందితుల నుంచి తప్పించుకునే క్రమంలోనే గాయాలు: పోలీసులు

Published : Jul 05, 2023, 02:45 PM IST
హయత్‌నగర్‌లో బాలికపై అత్యాచారం జరగలేదు.. నిందితుల నుంచి తప్పించుకునే క్రమంలోనే గాయాలు: పోలీసులు

సారాంశం

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కొందరు దుండగులు బాలిక‌ను కిడ్నాప్‌ చేసి అత్యారానికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కొందరు దుండగులు బాలిక‌ను కిడ్నాప్‌ చేసి అత్యారానికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎల్‌బీ నగర్ డీసీపీ మాట్లాడుతూ.. బాలికను నిందితులు అడ్రస్ అడిగేందుకు వచ్చినట్టుగా నటించి కిడ్నాప్ చేశారని తెలిపారు. బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదని చెప్పారు. దుండగుల బారి నుంచి బాలిక తప్పించుకుందని తెలిపారు. ఈ క్రమంలోనే బాలికకు గాయాలు అయినట్టుగా చెప్పారు. నిందితుల కోసం నాలుగు 4 బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ రిపోర్టు చేసింది.

అసలేం జరిగిందంటే.. 
హైదరాబాద్ శివార్లలోని హయత్‌ నగర్‌లో మంగళవారం రాత్రి బైక్‌పై వచ్చిన  దుండగులు బాలికను కిడ్నాప్ చేశారు. అడ్రస్ చెప్పాలంటూ బాలికను అడిగి.. మత్తుమందు స్ప్రే చేశారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. అయితే తీవ్రగాయాలతో వారి నుంచి తప్పించుకన్న బాలిక.. ఓఆర్‌ఆర్ సమీపంలో అటుగా వెళ్తున్నవారి సాయం కోరింది. ఆ సమయంలో ఓ హిజ్రా (ట్రాన్స్‌జెండర్) బాలిక వద్దకు చేరకుని సాయం అందించింది. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్నారు. తర్వాత బాలికను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?