భార్గవ్ రామ్ తండ్రి అరెస్టుకు రంగం సిద్ధం: రాత్రి భారీగా పోలీసుల మోహరింపు

By telugu teamFirst Published Jan 11, 2021, 7:51 AM IST
Highlights

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడు, భూమూ అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. భార్గవ్ రామ్ తండ్రి శ్రీరామ్ నాయుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. ఇతర నిందితుల కోసం కూడా పోలీసులు గాలింపు జరుపుతున్నారు.

ఇదిలావుంటే, భార్గవ్ రామ్ తండ్రి శ్రీరామ్ నాయుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆయనను విచారిస్తే భార్గవ్ రామ్ అచూకీ తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

Also Read: భూముల కోసం కాదు.. పెద్ద తలకాయల స్కెచ్: భూమా మౌనిక సంచలన వ్యాఖ్యలు

హైదరాబాదులోని యూసుఫ్ గుడాలో గల ఆయన ఇంటి వద్ద ఆదివారం రాత్రి భారీగా పోలీసులు మోహరించారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసుతో తనకు ఏ విధమైన సంబంధం లేదని, శనివారంనాడే తాను దుబాయ్ నుంచి వచ్చానని శ్రీరామ్ నాయుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

భార్గవ్ రామ్ మహారాష్ట్రలో ఉన్నాడనే సమాచారంతో అక్కడ గాలింపు జరుపుతుననారు. మరో బృందం గుంటూరు, కర్నూలుల్లో గాలిస్తోంది. బాధితులు ఇచ్చిన వివరాల ఆధారంగా కిడ్నాప్ చేసిన వ్యక్తుల ఊహాచిత్రాలను సిద్ధం చేస్తున్నారు. 

Also Read: భూమా అఖిలప్రియ బయటికొస్తే బెదిరిస్తారు: పోలీసుల వాదన

సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాప్ నకు రెండు మూడు రోజుల ముందు ప్రవీణ్ రావుఇంటి పరిసర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మాదాల శ్రీనివాస చౌదరి అలియాస్ గుంటూరు శ్రీను కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

click me!