ముషీరాబాద్ వాటర్ ట్యాంక్‌లో డెడ్ బాడీపై వీడిన సస్పెన్స్.. మృతుని వివరాలు గుర్తించిన పోలీసులు

By Sumanth KanukulaFirst Published Dec 8, 2021, 12:29 PM IST
Highlights

హైదరాబాద్‌లోని (Hyderabad)  ముషీరాబాద్ హరి నగర్ రీసాల గడ్డ వాటర్ ట్యాంక్‌లో (Musheerabad public water tank) లభ్యమైన మృతదేహం ఎవరిదనే సస్పెన్స్ వీడింది. తాజాగా మృతుని వివరాలను పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌లోని  ముషీరాబాద్ హరి నగర్ రీసాల గడ్డ వాటర్ ట్యాంక్‌లో (Musheerabad public water tank) లభ్యమైన మృతదేహం ఎవరిదనే సస్పెన్స్ వీడింది. రీసాల గడ్డ వాటర్ ట్యాంకులో లభించిన మృతదేహాన్ని.. చిక్కడపల్లి అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కిషోర్‌దిగా గుర్తించారు. ఘటన స్థలంలో లభ్యమైన చెప్పుల ఆధారంగా మృతదేహం కిషోర్‌దేనని తేల్చారు. కిషోర్ కొద్ది రోజుల క్రితం ఇంట్లో గొడవ పెట్టుకని వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించి కిషోర్ కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

వివరాలు.. ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రీసాలగడ్డ జలమండలి వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ట్యాంకు శుభ్రపరిచేందుకు వెళ్లిన సిబ్బంది మృతదేహాన్ని గుర్తించారు. సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో జలమండలి అధికారుల పోలీసులకు సమాచారం చెరవేశారు. అక్కడి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ట్యాంకు నుంచి బయటకు తీశారు. అయితే మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

మృతుడు ఎవరు? ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురయ్యాడా? అని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జహంగీర్‌యాదవ్‌ తెలిపారు. మృతుడికి 35 ఏళ్లుంటాయని చెప్పారు. బ్లూ జీన్స్‌ ధరించాడని తెలిపారు. దాదాపు 10 నుంచి 15 రోజులుగా మృతదేహం ట్యాంకులో ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. చుట్టూ పది అడుగుల ప్రహరీ, గేటు తాళం ఉంటుంది. అయినా అతడు లోపలకు రావడం, వంద అడుగుల ట్యాంకుపైకి ఎలా ఎక్కా డు? అనేది అంతుబట్టకుండా ఉంది. ఒక్కడే వచ్చాడా? ఇతరులతో కలిసి వచ్చాడా? అనేది తేలాల్సి ఉంది.

Also read: ఇంటర్మీడియట్ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్...

ట్యాంక్ పై ఉన్న చెప్పులు మృతునికి సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాటి ఆధారంగా విచారణ ప్రారంభించారు. మృతుడు ఎవరు? ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురయ్యాడా? అనే కోణాల్లోదర్యాప్తు కొనసాగించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు మూడు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లలో నమోదైన మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు. ఇటీవల కనిపించకుండా పోయిన వ్యక్తుల కేసులపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే మృతుడిని చిక్కడిపల్లికి చెందిన కిషోర్‌గా గుర్తించారు. మృతుదు తరుచూ వాటర్ ట్యాంక్ వద్దకు వస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది.

రీసాలగడ్డ జలమండలి వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం లభించిందనే విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు. గత కొంతకాలంగా తమకు కలుషిత నీరు వస్తుందని వారు పేర్కొన్నారు. మృతదేహం ఉన్న నీటిని తాము తాగినట్టుగా తెలుసుకున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే వారికి వైద్య పరీక్షలు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 

click me!