Omicron: థర్డ్ వేవ్ ను ఎదుర్కోడానికి... పక్కా ప్రణాళికలతో సంసిద్దం..: తెలంగాణ వైద్యారోగ్య మంత్రి

By Arun Kumar PFirst Published Dec 8, 2021, 12:05 PM IST
Highlights

కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోడానికి తెలంగాాణ సర్కార్ పక్కా ప్రణాళికలతో సిద్దంగా వున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 

హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicran) యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ మహమ్మారి ఇప్పటికే భారత్ లోకి కూడా ప్రవేశించింది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ (corona third wave) తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. టీఆర్ఎస్ సర్కార్ (trs government) మూడో వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కోడానికి ప్రణాళికతో సిద్దంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు (harish rao) వెల్లడించారు. 

హైదరాబాద్ కొండాపూర్ (kondapur) లోని ఆసుపత్రిలో 100 పడకలతో సిద్దంచేసిన నూతన అంతస్తును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గతంలో కరోనా విజృంభణ (corona outbreak) సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలకు డిమాండ్ ఎక్కువ వుండిందన్నారు. ఈ సమయంలో రహేజా కార్ప్ ముందుకు వచ్చి 100 పడకల సామర్థ్యం కలిగిన ఓ ఫ్లోర్ ని నిర్మించిందని... దాన్ని ఈరోజు ప్రారంభించుకున్నామని మంత్రి తెలిపారు. 

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ముందుకువచ్చిన మైండ్ స్పేస్ (mind space) సీఈఓ ని మంత్రి హరీష్ అభినందనలు తెలిపారు. ఇకపై ఆస్పత్రి నిర్వహణలో (hospital maintanace) కూడా మైండ్ స్పేస్ సహకారం కోరుతున్నామని హరీష్ రావు అన్నారు.  

read more  తెలంగాణలో మళ్లీ 200 దాటిన కరోనా కేసులు.. 6,77,341కి చేరిన సంఖ్య

కోవిడ్ సమయంలో హైదరాబాద్ (hyderabad) లోని వివిధ సంస్థలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి (CSR) లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 1300 పడకల ఏర్పాటుకు ముందుకువచ్చాయిని తెలిపారు. అలాగే 33 జిల్లాల్లో మొత్తం 6000 పడకలతో చిన్న పిల్లల కోసం పెడియాట్రిక్ విభాగాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27వేల పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీష్ తెలిపారు. 

ప్రభుత్వ దవాఖానాల్లో 154  కోట్ల రూపాయలతో 900లకు పైగా ఐసియు(icu)బెడ్స్ ఏర్పాటుకు సిద్దమైనట్లు... త్వరలోనే ఈ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని హరీష్ తెలిపారు. ప్రభుత్వం డయాలసిస్ యూనిట్ల (dialyysis units) పెంపుకు కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ (kcr kit) ఇవ్వడం ప్రారంభించాక 52% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని వైద్యమంత్రి తెలిపారు. కొండాపూర్ లో కూడా అతిత్వరలో ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హరీష్ ప్రకటించారు. 

read more  corona third wave :కరోనా థర్డ్‌వేవ్ తప్ప‌దు.. మ‌రో రెండు నెలల్లో పీక్ స్టేజ్

ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని మంత్రి హరీష్ సూచించారు. హైదరాబాద్ నగరంలోని కార్పొరేటర్లు తమ పరిధిలోని ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ అందేలా చూడాలని... రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి ఆరా తీయాలని సూచించారు. వ్యాక్సినేషన్ 100% జరగాలంటే ప్రజా ప్రతినిధులు సహా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీష్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.96 కోట్ల  వ్యాక్సిన్ డోస్ లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. రోజూ సుమారు 3.5 నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ లు ఇస్తున్నామని తెలిపారు. ఇలా ప్రతిఒక్కరు వ్యాక్సిన్ తీసుకుని కరోనా నుండి రక్షణ పొందాలని మంత్రి హరీష్ రావు సూచించారు.

 

click me!