అందమైన అమ్మాయిల ఫొటోలతో ఎర.. మసాజ్ పేరులో లక్షలకు టోకరా...

Published : Dec 08, 2021, 11:45 AM ISTUpdated : Dec 08, 2021, 11:52 AM IST
అందమైన అమ్మాయిల ఫొటోలతో ఎర.. మసాజ్ పేరులో లక్షలకు టోకరా...

సారాంశం

అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి ఎర వేశారు. అలా పలు దఫాలుగా అమాయకుడి నుంచి రూ.1.90 లక్షలు కాజేశారు. అంత పంపినా మసాజ్ కు అమ్మాయిని పంపకుండా కాలయాపన చేస్తుండడంతో మోసపోయినట్లు గుర్తించిన సదరు వ్యక్తి.. సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

హైదరాబాద్ : Body massage కోసం ‘Locanto’ spa site లో సెర్చ్ చేసిన యువకుడికి భారీ టోకరా వేశారు లొకాంటో ప్రతినిధులు. మసాజ్ చేసేందుకు అందమైన అమ్మాయిలను ఇంటికి పంపిస్తానంటూ మోసం చేశారు. గంటకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు చార్జ్ చేస్తారన్నారు. Beautiful girlని బట్టి రేటు ఉంటుందన్నారు. 

అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి ఎర వేశారు. అలా పలు దఫాలుగా అమాయకుడి నుంచి రూ.1.90 లక్షలు కాజేశారు. అంత పంపినా మసాజ్ కు అమ్మాయిని పంపకుండా కాలయాపన చేస్తుండడంతో మోసపోయినట్లు గుర్తించిన సదరు వ్యక్తి.. City Cybercrime పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కాగా ఇన్వెస్ట్ మెంట్ పేరుతో తనని మోసం చేశారంటూ నగరవాసి మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ. 2.20లక్షలు పెట్టుబడి పెట్టించారని.. ఒక్క రూపాయి కూడా లాభం రాలేదని ఫిర్యాదు చేశాడు. 

హైదరాబాద్: బాత్రూంలో మహిళ స్నానం చేస్తుండగా వీడియో... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇంటర్నెట్ టెక్నిషియన్

ఇక మరో కేసులో Credit card update పేరుతో తనని మోసం చేశారంటే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీవీవీ తెలుసుకుని ఓటీపీ చెప్పడంతో అకౌంట్ లో నుంచి రూ. 1.02 లక్షలు కాజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో స్పా సెంటర్ పేరుతో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ ముఠా అక్టోబర్ మూడున హైదరాబాద్ పోలీసులకు (చిక్కింది. హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో Spa Center ముసుగులో గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడిచేసి మగ్గురు మహిళలతో పాటు నిర్వహకుడు, ఓ విటుడిని అరెస్ట్ చేశారు. 

ఇంటర్మీడియట్ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్...

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ వెన్నెలగడ్డలో ఓ అపార్ట్ మెంట్ లో పర్సుల్ బ్యూటీ స్పా ఆండ్ సెలూన్ ను ఓ వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అయితే స్పా సెంటర్ ముసుగులో విటులను ఆకర్షించి అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. 

కొంతకాలంగా సదరు స్పాకు అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కువగా వస్తుండటంతో అనుమానించిన స్థానికులు, అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో సదరు స్పా సెంటర్ పై నిఘా వుంచిన పేట్‌బషీరాబాద్‌ పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. దీంతో తాజాగా స్పాం సెంటర్ పై దాడిచేసి నిర్వహకుడితో పాటు ముగ్గురు మహిళలు, ఓ విటుడిని అరెస్ట్ చేశారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్