ఏప్రిల్ 9న ఖమ్మంలో వైఎస్ షర్మిల సభకు పోలీసుల అనుమతి

Published : Mar 17, 2021, 11:11 AM IST
ఏప్రిల్ 9న ఖమ్మంలో  వైఎస్ షర్మిల సభకు పోలీసుల అనుమతి

సారాంశం

ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో వైఎస్ షర్మిల భారీ సభను నిర్వహించనున్నారు.ఈ సభ నిర్వహణ కోసం పోలీసుల అనుమతిని కోరారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.  

ఖమ్మం: ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో వైఎస్ షర్మిల భారీ సభను నిర్వహించనున్నారు.ఈ సభ నిర్వహణ కోసం పోలీసుల అనుమతిని కోరారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.తెలంగాణలో పార్టీ ఏర్పాటు కోసం షర్మిల అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే  రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 16వ తేదీన ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కీలక అంశాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో నిర్వహించే సభలో పార్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రకటన చేయనున్నట్టుగా ఆమె తెలిపారు.

also read:ఏప్రిల్ 9న పార్టీ: ఖమ్మంలో ప్రకటించనున్న షర్మిల

ఈ సభ నిర్వహణ కొరకు షర్మిల సన్నిహితులు ఖమ్మం పోలీసులను అనుమతి కోరారు. ఈ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు.ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ తో పాటు మరో గ్రౌండ్ లో సభ నిర్వహణ కోసం అనుమతి ఇచ్చినట్టుగా షర్మిల వర్గీయులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధించేందుకు గాను తాను ప్రజల ముందుకు వస్తున్నట్టుగా ఆమె తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్