గుడిసెలో తవ్విన కొద్దీ పాము పిల్లలు.. !!

Published : Mar 17, 2021, 09:16 AM IST
గుడిసెలో తవ్విన కొద్దీ పాము పిల్లలు.. !!

సారాంశం

మహబూబ్ నగర్ లో ఓ వింత జరిగింది. ఓ పూరి గుడిసెలో మట్టిని తవ్వితే పాము పిల్లలు బయట పడి కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో ఆ గుడిసెలో అప్పటివరకు నివసిస్తున్న మూడు కుటుంబాలు గజగజా వణికిపోయాయి.

వివరాల్లోకి వెడితే.. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలోని గవర్నమెంట్ కాలేజ్ వెనక భాగంలో ఉండే గుడిసెల్లో మూడు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ గుడిసెల్లో బుడగజంగం చిన్న కుర్మన్న ఉంటున్న గుడిసెలో దుర్వాసన వస్తుండడంతో అనుమానంతో గుడిసెలో ఓ మూల మట్టిని తవ్వారు. 

ఆ మట్టిలోనుండి మొదట ఒక పాము పిల్ల బైటికి వచ్చింది. దాన్ని చంపుదామనుకునేలోపు.. ఒకదానివెంట ఒకటిగా వరుసగా మొత్తం 21 పాము పిల్లలు బైటికి వచ్చాయి. వాటిని కర్రతో కొట్టి చంపేశారు. అయితే పది రోజుల కిందట ఇదే గుడిసెలో ఓ పెద్ద పాము కనిపించింది. దాన్ని కూడా ఇలాగే చంపేశారు. గుడిసెలో వీరితో పాటు ఆరుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కాగ ఎవరికీ అపాయం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్