వారిద్దరూ మంచి స్నేహితులు, కాల్పులకు కారణం అదే: ఆబిడ్స్ ఎస్‌బీఐ కాల్పులపై పోలీసులు

By narsimha lodeFirst Published Jul 14, 2021, 4:42 PM IST
Highlights


ఆబిడ్స్ ఎస్‌బీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డు, కాంట్రాక్టు ఉద్యోగి సురేందర్ పై కాల్పులకు జోకులు వేసుకొనే క్రమంలో మాటా తూలడం కాల్పులకు దారితీసిందని పోలీసులు గుర్తించారు. సర్ధార్ ఖాన్  ఈ విషయమై ఏడేళ్లుగా సురేందర్ ను హెచ్చరిస్తున్నాడు. సురేందర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

హైదరాబాద్: ఇద్దరు స్నేహితుల మధ్య టీజ్ చేసుకొనే క్రమంలో గొడవ పెద్దదిగా మారి కాల్పులకు దారి తీసింది. హైద్రాబాద్ ఆబిడ్స్ ఎస్‌బీఐ లో కాల్పుల ఘటనకు సంబంధించి  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైద్రాబాద్ ఆబిడ్స్ ఎస్‌బీఐలో 9 ఏళ్లుగా సర్ధార్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సర్ధార్ ఖాన్ ది వరంగల్ జిల్లా. ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేయడానికి ముందు ఆయన ఆర్మీలో పనిచేశాడు.

also read:హైద్రాబాద్‌లో కాల్పుల కలకలం: తోటి ఉద్యోగిపై ఎస్బీఐ సెక్యూరిటీ గార్డు కాల్పులు

ఇదే బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిా సురేందర్ పనిచేస్తున్నాడు. సురేందర్, సర్ధార్ ఖాన్ మంచి స్నేహితులు. ఇద్దరూ తరచూ జోకులు వేసుకొనేవారు.ఒకరినొకరు టీజ్ చేసుకొనే క్రమంలో సురేందర్  ఉపయోగించే కొన్ని వ్యాఖ్యలపై సర్ధార్ ఖాన్ అభ్యంతరం చెప్పేవాడు. ఏడేళ్లుగా ఇదే విసయమై ఇద్దరి మధ్య గొడవలున్నాయి. 

ఇవాళ కూడ లంచ్ తర్వాత సర్ధార్ ఖాన్ తో సురేందర్ మాట్లాడారు. ఈ క్రమంలోనే తాను అభ్యంతరం చెప్పే మాటలను ఉపయోగించడంతో సర్ధార్ ఖాన్ సురేందర్ మధ్య మాటా మాటా పెరిగింది. కోపం ఆపుకోలేని సర్ధార్ ఖాన్ తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో సురేందర్ పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. సురేందర్ ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సురేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు.
 

click me!