ప్రాజెక్ట్‌లు కడతా, నీళ్లు దొంగిలిస్తా అంటే.. చూస్తూ ఊరుకోము: జగన్‌కు టీఆర్ఎస్ నేత పల్లా హెచ్చరిక

By Siva KodatiFirst Published Jul 14, 2021, 4:04 PM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ఆయన బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్ట్‌లు కడతా, నీళ్లు దొంగిలిస్తా అంటే చూస్తూ ఊరుకోమని పల్లా హెచ్చరించారు. 
 

కృష్ణా నదీ జల వివాదంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. లేని నీటి కోసం ఏపీ అక్రమాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నా ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్ట్‌లు కడతా, నీళ్లు దొంగిలిస్తా అంటే చూస్తూ ఊరుకోమని పల్లా హెచ్చరించారు. నీటిపై మా హక్కును కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై హక్కు లేని వాళ్లు కోర్టుకు వెళ్తున్నారని పల్లా ధ్వజమెత్తారు. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 

Also Read:కేసీఆర్‌కి జగన్ కౌంటర్: కృష్ణా జలాలు, రాయలసీమ ప్రాజెక్టులపై సుప్రీంలో ఏపీ పిటిషన్

బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ  సభ్యుల సంఖ్య 61 లక్షలకు చేరుకుందని, ఇప్పటి వరకు 48 లక్షల మంది సభ్యుల వరకు డిజిటలైజేషన్ పూర్తి చేశామన్నారు. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి 61 లక్షల మంది సభ్యులు లేరని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో పార్టీ నిర్మాణం మొదలైందని, 24 జిల్లాల్లో పూర్తయ్యాయని, 7 జిల్లాలో 95 శాతం పనులు పూర్తి అయ్యాయని వివరించారు. ప్రతి జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభిస్తారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు నెలల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తామని, ప్రతి కార్యకర్త దగ్గరకు పార్టీ వెళ్లి వారికి అందుబాటులో నిలుస్తామని పల్లా తెలిపారు. 
 

click me!