ఏడేళ్లలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి: కేబినెట్ భేటీలో కేసీఆర్ హర్షం

Siva Kodati |  
Published : Jul 14, 2021, 04:35 PM IST
ఏడేళ్లలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి: కేబినెట్ భేటీలో కేసీఆర్ హర్షం

సారాంశం

గతేడాది రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం వుందని సీఎం వెల్లడించారు. ఈ వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. 

ఏడేళ్లలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు తెలంగాణ సీఎం కేసీఆర్. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు. రైతు బంధు కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో వుంచుతున్నామని.. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం చాలా పెరిగిందని సీఎం వెల్లడించారు.

గతేడాది రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం వుందని సీఎం వెల్లడించారు. ఈ వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ధాన్యం నిల్వ, మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్ధ్యాన్ని మరింత పెంచుకోవాలని సీఎం సూచించారు. రైస్ మిల్లుల్లో మిల్లింగ్ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. నూతన రైస్ మిల్లులు, పారాబాయిల్డ్ మిల్లులను స్థాపించాలని కేసీఆర్ పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్