ఉద్దేశ్యపూర్వకంగానే తమపై కేసులు నమోదు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కేసులో తనను పోలీసులు విచారించడం కూడా ఇందులో భాగమేనని ఆయన విమర్శించారు.
హైదరాబాద్: తనకు ప్రశాంత్ నుండి టెన్త్ క్లాస్ హిందీ పేపర్ వాట్సాప్ లో రాలేదని పోలీసులు గుర్తించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కుట్ర కేసుకు సంబంధించి సోమవారంనాడు పోలీసులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను విచారించారు. విచారణ ముగిసిన తర్వాత ఈటల రాజేందర్ వరంగల్ లో మీడియాతో మాట్లాడారు.
ప్రశాంత్ నుండి తనకు హిందీ పేపర్ వాట్సాప్ చేశారని పోలీసులు ఆరోపించారన్నారు. ఇవాళ పోలీసుల విచారణకు తాను తన మొబైల్ తో సహా వెళ్లినట్టుగా రాజేందర్ చెప్పారు. తన ఫోన్ ను పోలీసులు పరిశీలించారన్నారు. తనకు ప్రశాంత్ నుండి ఎలాంటి ఫోన్ కానీ, ప్రశ్నాపత్రం కూడా రాలేదని పోలీసులు నిర్ధారించారన్నారు. హుజూరాబాద్ అ
సెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మహేష్ యాదవ్ అనే వ్యక్తి ప్రశ్నాపత్రం స్క్రీన్ షాట్ ను తనకు పంపాడని ఈటల రాజేందర్ చెప్పారు. కానీ తాను ఈ వాట్సాప్ ను చూడలేదని పోలీసులు గుర్తించినట్టుగా రాజేందర్ తెలిపారు. ఈ పేపర్ ను తాను ఎవరికి కూడా షేర్ చేయలేదని పోలీసులు గుర్తించారని ఈటల రాజేందర్ వివరించారు. ప్రగతి భవన్ నుండి వచ్చిన ఆదేశాలతోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. 20 ఏళ్లుగా స్రజా జీవితంలో ఉన్న తాను వరంగల్ పోలీసుల విచారణకు హాజరైనట్టుగా రాజేందర్ చెప్పారు. తన సెల్ ఫోన్ డేటాను కూడా పోలీసులు తీసుకున్నారన్నారు. ఇది పేపర్ లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్ అని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.
undefined
also read:టెన్త్ పేపర్ లీక్ కేసు.. పోలీసులు ఎదుట విచారణకు హాజరైన ఈటల రాజేందర్..
ప్రశాంత్ తెలుసా, ప్రశాంత్ ఎప్పుడైనా ఫోన్ చేశాడా, ప్రశాంత్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావా అని పోలీసులు తనను అడిగారని ఈటల రాజేందర్ చెప్పారు.ఈ నెల 4వ తేదీన టెన్త్ క్లాస్ హిందీ పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది . పలువురు పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులకు ఈ పేపర్ వాట్సాప్ లో షేర్ చేశారు. ఈ కేసులో ప్రశాంత్ ను పోలీసులు అరెస్్ చేశారు. ఈ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఈ నెల 4వ తేదీ రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ నుండి బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కు కూడా టెన్త్ క్లాస్ హిందీ పేపర్ షేర్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ విషయమై ఈటల రాజేందర్ కు నాలుగు రోజుల క్రితం పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసుల నోటీసులు తీసుకన్న ఈటల రాజేందర్ ఇవాళ వరంగల్ డీసీపీ ముందు విచారణకు హాజరయ్యారు.