మారుతీరావు చివరిగా ఎవరితో మాట్లాడారు..? రెండు వారాల్లో ...

By telugu news teamFirst Published Mar 11, 2020, 10:41 AM IST
Highlights

ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం కూతురు దూరమైందన్న బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మారుతీరావు ఆత్మహత్య కేసులో సైఫాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సరిగ్గా సంవత్సరంన్నర క్రితం కూతురు వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో ప్రణయ్ అనే యువకుడిని నడిరోడ్డుపై మారుతీరావు హత్య చేయించాడు. ఈ ప్రణయ్ హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మారుతీరావు.. ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

Also Read మారుతీరావుకు విషం ఎక్కడిది, కాల్‌డేటాపై ఆరా...

 ఖైరతాబాద్ చింతలతబస్తీలో ని వైశ్య భవన్ లో మారుతీరావు పరుగుల మందు కలిపిన గారెలు తిని ప్రాణాలు కోల్పోయాడు. అయితే... ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం కూతురు దూరమైందన్న బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మారుతీరావు శరీరావయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఈ నివేదిక రావడానికి కనీసం రెండు వారాలైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈలోపు ఇతర  విషయాలపై దృష్టిసారించినట్లు పోలీసులు చెప్పారు.

ఇప్పటికే మారుతీరావు విష ప్రభావం కారణంగానే ప్రాణాలు కోల్పోయారని ఉస్మానియా పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన శరీరంపై ఎలాంటి చిన్న గాయం కూడా లేదని చెప్పారు. మారుతీరావు మరణం తర్వాత అతడు చనిపోయిన గది నుంచి సూట్ కేస్, సెల్ ఫోన్ , పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న ట్లు చెప్పారు.

అతనితో చివరి రెండు, మూడు రోజుల్లో ఫోన్ లో మాట్లాడిన వారిన కాల్ డేటా పై దృష్టిసారించినట్లు చెప్పారు. కొంత సమాచారం సేకరించిన తర్వాత మారుతీరావుతో టచ్ లో ఉన్న వారిని పిలిపించి విచారణ జరిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!