వివాహిత ఆత్మహత్య... పోలీసుల కళ్లల్లో కారం చల్లి..

By telugu news teamFirst Published Mar 11, 2020, 9:08 AM IST
Highlights

 మంజుల.. తిరిగి తిరుపతి నుంచి పుట్టింటికి వచ్చింది. అయితే... ఆమె పుట్టింటికి చేరిన కొద్ది గంటలకే పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.   దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్త గణేష్‌ అతని స్నేహితుడు గోపాల్‌ను శిక్షించాలని పోస్టుమార్టంను అడ్డుకున్నారు.
 

భర్త మందలించాడని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సదరు మహిళ ఆత్మహత్య కేసు విచారణ నిమిత్తం సంఘటనాస్థలానికి వచ్చిన పోలీసులకు ఆమె బంధువులు చుక్కలు  చూపించారు. కళ్లల్లో కారం చల్లారు. ఈ సంఘటన నిజామాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం డీబీ తండాకు చెందిన మంజుల (22)కు గుట్టకింది తండాకు చెందిన లావుడ్య గణేష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది.
అయితే... కొద్ది రోజులుగా మంజుల ప్రవర్తన  సరిగా ఉండటం లేదు. ఈ క్రమంలో భర్త గణేష్.. మంజులను మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన మంజుల ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

కాగా.. కూతురు కనిపించడం లేదంటూ మంజుల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులుకు మంజుల తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో.. మంజుల.. తిరిగి తిరుపతి నుంచి పుట్టింటికి వచ్చింది. అయితే... ఆమె పుట్టింటికి చేరిన కొద్ది గంటలకే పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.   దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్త గణేష్‌ అతని స్నేహితుడు గోపాల్‌ను శిక్షించాలని పోస్టుమార్టంను అడ్డుకున్నారు.

Also Read ప్రేమ పేరిట మాయ మాటలు.. మైనర్ బాలికలపై అఘాయిత్యం...

మరోవైపు డీబీ తండా నుంచి 200 మంది మహిళలు మంగళవారం మధ్యాహ్నం డీసీఎం వ్యానులో గుట్టకింది తండాకు బయలు దేరారు. ముందస్తు సమాచారంతో పోలీసులు వారి వాహనాన్ని మార్గమధ్యలో అడ్డుకున్నారు. అయితే మహిళలు కారం పొడి, కర్రలు పట్టుకుని కాలినడకన గుట్టకింది తండాకు చేరుకున్నారు. పోలీసులను తోసేసి గణేష్, గోపాల్‌ ఇళ్లపై దాడి చేసి ఫర్నిచర్, తలుపులను ధ్వంసం చేశారు.

ఈ క్రమంలో మహిళా పోలీసులపై దాడి జరగడంతో లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇన్‌చార్జి ఏసీపీ ప్రభాకర్, అడిషనల్‌ డీజీపీలు ఉషా విశ్వనాథ్, రఘవీర్‌లు గుట్టకింది తండాకు చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. మంజుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. గోపాల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. గుట్టకింది తండాలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించి పోలీసులపై దాడి చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 

click me!