మహిళా సినీ నిర్మాతకు లైంగిక వేధింపులు: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు

Published : Jul 13, 2023, 08:54 PM IST
మహిళా సినీ నిర్మాతకు  లైంగిక వేధింపులు: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో  కేసు

సారాంశం

మహిళా సినీ నిర్మాతపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.  


హైదరాబాద్: మహిళ సినీ నిర్మాతను లైంగిక వేధింపులకు పాల్పడిన  వ్యక్తిపై  హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు  గురువారంనాడు కేసు నమోదు  చేశారు.హైద్రాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు సమీపంలో కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కు వెళ్లిన మహిళ నిర్మాతపై ఓ వ్యక్తి  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  వాకింగ్ కు చేస్తున్న సమయంలో  అతను  ఆమెను తన ఫోన్ లో రికార్డు చేశారు.  తన పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు  జూబ్లీహిల్స్ పోలీసులకు  ఫిర్యాదు  చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  కేసు నమోదు  చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా  ప్రతిరోజూ  ఏదో ఒక చోట చోట్ల లైంగిక వేధింపుల కేసులు నమోదౌతున్నాయి. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు పాలకులు  అనేక చట్టాలు తీసుకువచ్చినా కూడ  ఈ తరహా కేసుల నమోదు ఆగడం లేదు.   కొన్ని రాష్ట్రాల్లో  నిందితులకు త్వరగా శిక్షలు ఖరారయ్యేలా  కూడ ప్రభుత్వాలు  చర్యలు తీసుకుంటున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave : హమ్మయ్యా..! ఇక చలిగండం గట్టెక్కినట్లేనా..?
Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్