నాతో పొలంలో పోటీ పడగలరా?: ఉచిత విద్యుత్ పై కేటీఆర్ కు రేవంత్ సవాల్

By narsimha lode  |  First Published Jul 13, 2023, 6:10 PM IST

ఉచిత విద్యుత్ పై  తానా సభల్లో తాను  చేసిన వ్యాఖ్యలను  బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెప్పారు. 


హైదరాబాద్:   ఉచిత విద్యుత్ పై  తానా సభల్లో తాను   చేసిన వ్యాఖ్యలను  బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెప్పారు.గురువారంనాడు హైద్రాబాద్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఉచిత విద్యుత్ రైతులకు  మూడు గంటలు సరిపోతుందని  తానా సభల్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ  తెలంగాణలో   బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించింది.  ఉచిత విద్యుత్ పై  బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని  కాంగ్రెస్ కూడ పోటీ నిరసనలకు దిగింది.

Latest Videos

 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  ఉచిత విద్యుత్ ఉంటుందా అని అడిగారన్నారు.ఈ విషయమై తాను  చేసిన వ్యాఖ్యలను  వక్రీకరించారన్నారు. తాను  చేసిన వ్యాఖ్యల్లో చిన్న బిట్ ను కట్ చేసి ఐటీ మంత్రి కేటీఆర్ వక్రీకరించారన్నారు. ఉచిత విద్యుత్ పై చర్చకు కాంగ్రెస్ సిద్దమని రేవంత్ రెడ్డి  చెప్పారు. 2004 మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. 

ఉచిత విద్యుత్ కుదరదని ఆనాడు టీడీపీతో చెప్పించిందే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి చెప్పారు.  విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాల్పుల ఘటనకు   కేసీఆర్  కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పై తొలి సంతకం పెట్టారన్నారు.

2009లో ఏడు గంటల నుండి 9 గంటలకు  విద్యుత్ సరఫరాను  పెంచారన్నారు. రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్సే అని  ఆయన చెప్పారు.  తాను రైతు బిడ్డను... వ్యవసాయం చేశాను.... నాగలితో దుక్కి దున్నడం కూడ  తెలుసునని చెప్పారు. తనతో  పొలంలో  కేటీఆర్ పోటీ పడగలరా, తనతో వ్యవసాయం చేయగలరా అని  రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

 ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటేంట్ అని  రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   కాంగ్రెస్ విధానమే 24 గంటల ఉచిత విద్యుత్ అని  ఆయన గుర్తు  చేశారు.   ఉచిత కరెంట్ ను కేసీఆర్ తన అవినీతికి వాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. రైతులకు  కనీసం 12 గంటలు కూడ విద్యుత్ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి  చెప్పారు. తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి  సవాల్ ను  స్వీకరించాలని ఆయన  కేటీఆర్ ను కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని  కేసీఆర్ కు సర్వే రిపోర్టు అందిందన్నారు. ఈ భయంతోనే  కాంగ్రెస్ పార్టీపై  ఉచిత విద్యుత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని  రేవంత్ రెడ్డి  చెప్పారు.  బీఆర్ఎస్ కు చెందిన  80 శాతం ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారని  రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

click me!