హాజీపూర్ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి కోర్టులో గురువారం నాడు తన వాదనను విన్పించారు. ఈ కేసులో తన తరపున సాక్షులను ప్రవేశపెట్టాలని కోర్టును కోరారు.
నల్గొండ: హాజీపూర్ వరుస హత్యలతో తనకు సంబంధం లేదని ఈ కేసులో ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గురువారం నాడు నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Also read:కోర్టుకు శ్రీనివాస్ రెడ్డి: నెలాఖరుకు హాజీపూర్ తుది తీర్పు
హాజీపూర్ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని రాచకొండ పోలీసులు గురువారం నాడు నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు నమోదు చేసిన సాక్ష్యాలను నల్గొండలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డికి సాక్ష్యాలను చదివి విన్పించారు.
Also read:హాజీపూర్ కేసు: జడ్జి ప్రశ్నలకు నోరు మెదపని శ్రీనివాస్ రెడ్డి
అయితే ఈ కేసులతో తను సంబంధం లేదని ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కోర్టుకు చెప్పారు. పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన చెప్పారు. గ్రామంలోని కొందరితో తమ కుటుంబానికి భూ తగాదాలు ఉన్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
హాజీపూర్‌లో హత్యకు గురైన విద్యార్ధిని కేసులో ఇప్పటికే పలువురు సాక్షులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు చివరిదశకు చేరుకొంది. ఈ కేసు విచారణను కోర్టు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.
హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్థుల హత్యలతో పాటు కర్నూల్ లో ఓ మహిళ హత్య కేసులో కూడ శ్రీనివాస్ రెడ్డి నిందితుడని పోలీసులు గతంలో ప్రకటించారు.
నిందితుడి తరపున తన తల్లిదండ్రులను కోర్టులో సాక్షులుగా ప్రవేశపెట్టాలని శ్రీనివాస్ రెడ్డి కోర్టును కోరారు. జనవరి 3వ తేదీన నిందితుడి తరపున కుటుంబసభ్యులను కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.