అతని మాయమాటలను బాలిక పూర్తిగా నమ్మేసింది. దీంతో... అదే అదనుగా చేసుకొని బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెకు చెప్పాడు. బాలిక ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. బాలిక సెలవలు అనంతరం తమ గ్రామానికి వెళ్లిపోగా... అక్కడకు వెళ్లి కూడా ఆమెపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
సెలవలకు అని బాలిక అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ బాలికకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. నిజమని బాలిక నమ్మగానే.... ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... కాప్రాకు చెందిన శ్రీధర్ గౌడ్ కుమారుడు ప్రణయ్(21) డిప్లమా పూర్తి చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. అతని ఇంటికి సమీపంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి 17ఏళ్ల బాలిక గత మే నెల వేసవి సెలవులకు వచ్చింది. అప్పుడు బాలికకు ప్రణయ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు.. ప్రేమ పేరిట బాలికకు మరింత దగ్గరయ్యాడు.
అతని మాయమాటలను బాలిక పూర్తిగా నమ్మేసింది. దీంతో... అదే అదనుగా చేసుకొని బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెకు చెప్పాడు. బాలిక ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. బాలిక సెలవలు అనంతరం తమ గ్రామానికి వెళ్లిపోగా... అక్కడకు వెళ్లి కూడా ఆమెపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
కాగా.... ఇటీవల రెండు రోజుల క్రితం ప్రణయ్.. బాలికకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీనిని బాలిక తల్లిదండ్రులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను మందలించడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు.