తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం నాడు తెలంగాణ భవనంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. నమ్ముకొన్నవాడికి పనులు చేయడం, ముక్కుసూటిగా కేటీఆర్ వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడ కేటీఆర్ కీలకంగా వ్యవహరించారని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.
కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కేటీఆర్ పనిచేస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం కేసీఆర్ తర్వాత కేసీఆర్‌కు ఉందన్నారు. క్లాస్‌లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి తర్వాత సెకండ్ వ్యక్తి కోసం చూస్తారని ఆయన చెప్పారు. ఈర్ష్య, ద్వేషం ఉన్నవాళ్లు ఇలా కాకుండా చేసే అవకాశం ఉందని చెప్పారు.
Also read:తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ యోచనలో కేసీఆర్, సీఎం గా కేటీఆర్?
రాష్ట్రంలో ప్రజలకు మాత్రం కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రిగా కావాలనే అభిప్రాయంతో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తమ పార్టీ నాయకుడు కేసీఆర్ నిర్ణయం తీసుకొంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Also read:కొత్త ఏడాదిలో కేటీఆర్‌కు సీఎం పగ్గాలు?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడ కులమతాలను రెచ్చగొట్టడం విపక్షాలకు అలవాటుగా మారిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా ఎలాంటి సభలు లేవన్నారు.