షామీర్ పేట రేవ్ పార్టీలో ఏపి అమ్మాయిలు...ఉద్యోగాలే ఎర...: పోలీసులు

Published : Dec 22, 2018, 04:29 PM ISTUpdated : Dec 22, 2018, 04:39 PM IST
షామీర్ పేట రేవ్ పార్టీలో ఏపి అమ్మాయిలు...ఉద్యోగాలే ఎర...: పోలీసులు

సారాంశం

శామీర్ పేటలో శుక్రవారం రాత్రి ఓ రిసార్టులో రేవ్ పార్టీ జరుపుకుంటున్న డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీ కోసం వారు తీసుకువచ్చిన ముగ్గురు యువతుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు అమ్మాయిలను మోసపూరితంగా ఈ రొంపిలోకి లాగినట్లు పోలీసుల  విచారణలో బయటపడింది. 

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఓ పోలీస్ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు.రేవ్ పార్టీలో పట్టుబడిన అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ కు తీసుకువచ్చి ఈ రొంపిలోకి లాగినట్లు వెల్లడించారు. పట్టుబడిన  ముగ్గురిలో ఇద్దరమ్మాయిలు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు కాగా మరో యువతిది ముంబయిగా పేర్కొన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ నుండి అమ్మాయిలను హైదరాబాద్ కు తీసుకువచ్చిన మహిళను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువతులను  కోర్టులో  హాజరుపర్చి మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. 

ఈ వ్యవహారంలో పార్మా కంపనీల హస్తంపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కేసు విచారణలో వుంది కాబట్టి ఆ అంశంపై ఇంకా స్పష్టత లేదని...అతిత్వరలో ఈ వ్యవహారంతో ఎవరెవరికి సంబందాలున్నాయో బయటపెడతామని పోలీసులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

షామీర్ పేట రేవ్ పార్టీ వెనుక భారీ కుంభకోణం....అమ్మాయిలను సప్లైచేసింది వాళ్లే

హైదరాబాద్ శివారులో వైద్యుల రేవ్ పార్టీ...

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!