దివ్యాంగురాలిపై పట్టపగలే అత్యాచారం...

Published : Dec 22, 2018, 03:55 PM IST
దివ్యాంగురాలిపై పట్టపగలే అత్యాచారం...

సారాంశం

ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు పట్టపగలే దివ్యాంగురాలిని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాపం...తనపై అఘాయిత్యం జరుగుతున్నా బాలిక నిస్సహాయురాలిగా ఉండిపోయింది. చివరకు ఎలాగోలా తల్లివద్దకు చేరుకుని తనపై జరిగిన అఘాయిత్యం గురించి సైగల సాయంతో వివరించింది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన ప్రకాశ రావు(35) అనే వ్యక్తి ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం పెగళ్లపాడు గ్రామంలోని బంధువుల వద్దకు వచ్చాడు. కొద్ది రోజులుగా అక్కడే వుంటున్న అతడు ఓ బదిర యువతిపై కన్నేశాడు. బాలికకు మాటలు రావు కాబట్టి ఏం చేసినా ఎవరికి తెలియదని భావించి పట్టపగలే అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

ఇంట్లోంచి ఒంటరిగా బయటకు వచ్చిన బాలికను గమనించిన నిందితుడు ఇదే అదునుగా భావించాడు. బాలికను బలవంతంగా దగ్గర్లోని పొలాల్లోకి లాక్కెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు.  

ఇంటికి చేరుకున్న బాలిక తల్లికి తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. దీంతో ఇద్దరు కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu
IMD Rain Alert : ఈ రెండ్రోజులూ భారీ వర్షాలే.. ఈ పది జిల్లాల్లో పవర్ ఫుల్ వానలు, ఇక అతలాకుతలమే