బాలికపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారయత్నం.. ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో దుశ్చర్య..

By Asianet News  |  First Published Oct 29, 2023, 6:55 AM IST

ఓ పోలీసు కానిస్టేబుల్ బాలికపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అతడిని చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


అతడో పోలీసు కానిస్టేబుల్. సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతూ, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన గొప్ప వృత్తిలో ఉన్నాడు. కానీ అతడి బుద్ది గడ్డి తిన్నది. ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడి, ఒంటరిగా నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు లేచి, బాలిక అతడి బారి నుంచి రక్షించారు. నిందితుడిని చితకబాదారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తాం.. : మంత్రి కేటీఆర్

Latest Videos

ఎస్పీ కోటిరెడ్డి తెలిపిన వివరాలు, ‘ఈనాడు’ కథనం ప్రకారం.. వికారాబాద్ మండలంలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్న నర్సింహులు పోలీసు డిపార్ట్ మెంట్ లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఆయన జిల్లా డిస్ట్రిక్ట్ సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఆఫీస్ లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తన ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ నివాసంలోకి అక్రమంగా చొరబడ్డాడు. ఓ గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న బాలిక దగ్గరకు వెళ్లాడు.

మామ మూడో సారి సీఎం అవుతారు.. పవర్ మన చేతిలోనే ఉంటుంది - ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ

అనంతరం ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఆకస్మిక పరిణామంతో ఉలిక్కిపడ్డ బాలిక కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో పక్క గదిలో నిద్రపోతున్న కుటుంబ ఓ మహిళకు మెలుకువ వచ్చింది. కానిస్టేబుల్ దుశ్చర్యను గమనించి, మిగితా కుటుంబ సభ్యులను నిద్రలేపింది. దీంతో బాధితురాలి అన్న నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్ ను చితకబాదిన తరువాత ‘షీ’ టీమ్ కు సమాచారం ఇచ్చాడు. 

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచే సీఎంలు - ఈటల రాజేందర్

ఈ ఘటనపై ఫిర్యాదు చేయవద్దని నిందితుడు నర్సింహులు ఎంతో బతిమిలాడాడు. కానీ బాలిక కుటుంబ సభ్యులు దానికి ఒప్పుకోలేదు. బాధితురాలు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి ఎస్ఐ ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. కాగా.. ఈ ఘటనపై ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు. హెడ్ కానిస్టేబుల్ పై డిపార్ట్ మెంటల్ యాక్షన్ కు శనివారం ఆదేశాలు జారీ చేశారు.

click me!