Kamareddy Constituency: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తామని అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని ఎనిమిది విలీన గ్రామాలకు చెందిన 22 మంది రైతులు కేటీఆర్ ను కలిసి కొత్త మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. ఈ క్రమంలోనే మంత్రి ఈ ప్రకటన చేశారు.
BRS working president and IT minister KTR: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తామని అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని ఎనిమిది విలీన గ్రామాలకు చెందిన 22 మంది రైతులు కేటీఆర్ ను కలిసి కొత్త మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. ఈ క్రమంలోనే మంత్రి ఈ ప్రకటన చేశారు.
వివరాల్లోకెళ్తే.. మాస్టర్ ప్లాన్ విషయంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా వందకు పైగా నామినేషన్లు వేస్తామని హెచ్చరించిన రైతులు తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించుకున్న తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వారితో జరిపిన చర్చల ప్రయత్నాలు ఫలించాయి. సమస్య పరిష్కారం కోసం శనివారం రైతు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను పిలిపించి కామారెడ్డి మున్సిపాలిటీకి కొత్త మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గత జనవరిలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న రైతులపై పోలీసు కేసులను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారు.
undefined
కామారెడ్డి మున్సిపాలిటీలోని ఎనిమిది విలీన గ్రామాలకు చెందిన 22 మంది రైతులు కేటీఆర్ ను కలిసి కొత్త మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. కొత్త మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేశామని తెలిపారు. టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డైరెక్టరేట్ అధికారులు, డీజీపీ అంజనీకుమార్, కామారెడ్డి ఎస్పీ సింధుశర్మతో మాస్టర్ ప్లాన్ పై మాట్లాడి రైతులపై ఉన్న కేసుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ ను అనుసరించాలని డీటీసీపీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించదని హామీ ఇచ్చారు.
అనంతరం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు ఎం.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల సారవంతమైన వ్యవసాయ భూములపై తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రి కేటీఆర్ కు తెలియజేశామని చెప్పినట్టు డెక్కన్ క్రానికల్ పేర్కొంది. రైతులపై పెట్టిన కేసులు త్వరలోనే ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త మాస్టర్ ప్లాన్ రద్దుపై అధికారిక ప్రకటన చేయడంలో ఉన్న కష్టాన్ని రైతులు అర్థం చేసుకున్నారన్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నిలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు.