
పెద్దపల్లి: ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో దూకి ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. అతడు నదిలో దూకడాన్ని గమనించిన వారు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
Godavarikhani కమీషనరేట్ పరిధిలో సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అలెగ్జాండర్. అయితే గతకొంతకాలంగా అతడు కుటుంబకలహాలతో బాధపడుతున్నాడు. అందువల్లే అతడు నదిలోదూకి suicide చేసుకున్నట్లు తెలుస్తోంది.
read more గద్వాల జిల్లాలో విషాదం: గోడకూలి ఐదుగురు మృతి, ఇద్దరికి గాయాలు
కానిస్టేబుల్ అలెగ్జాండర్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న గోదావరిఖని టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గోదావరి నదిలో గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.