అధికార టీఆర్ఎస్ పై పోటీ... కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ పై కేసు నమోదు

By Arun Kumar PFirst Published Nov 29, 2021, 11:53 AM IST
Highlights

అధికార టీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటబావుటా ఎగరేసి స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ స్థానికసంస్థల ఎమ్మెల్సీగా బరిలోకి దిగిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. 

కరీంనగర్: అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి  కరీంనగర్ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ భారీగా డబ్బులు ఖర్చుచేయనుందని... ఓటుకు రూ.10లక్షలు ఇస్తోందంటూ ఆయన ఆరోపించారు. అయితే ఓటుహక్కు కలిగిన ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ఇచ్చే రూ.10లక్షలు తీసుకోవాలని... ఓటు మాత్రం ఒక్కరూపాయి ఇచ్చే తనకే వేయాలని కోరాడు. ఈ వ్యాఖ్యలు నేపథ్యంలోనే రవీందర్ సింగ్ పై కేసు నమోదయ్యింది.

karimnagar district లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓటర్లను ఇతర పార్టీల వద్ద డబ్బులు తీసుకుని తనకు ఓటు వేయాలని ravinder singh మీడియా సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ఇలా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఓటర్లుగా ఉన్న స్థానికసంస్థల ప్రజాప్రతినిధులను వారి పార్టీల వద్ద రూ.10 లక్షలు తీసుకొని తనకు ఓటు వేయాలని కోరడంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి.  

ఈ నేపథ్యంలో కరీంనగర్ ఆర్డీవో ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న కరీంనగర్ రూరల్ ఎంపీడీవో సంపత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు karimnagar mlc candidate రవీందర్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు.  

read more  ఎమ్మెల్సీ ఎన్నికలు: రవీందర్ సింగ్ వ్యూహాత్మకం.. కాంగ్రెస్ ఓట్లపై ఫోకస్, జీవన్‌రెడ్డితో మంతనాలు

ఇదిలావుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత టీఆర్ఎస్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి అధిష్టానంపై ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ స్థానం ఆశించి భంగపడ్డ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ పై తిరుగుబాటు బావుటా ఎగరేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. 

TRS Party కి రాజీనామా చేసి ఎమ్మెల్సీ బరిలోకి దిగడమే కాదు తనకు మద్దతివ్వాలని అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నారు రవీందర్ సింగ్. ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబును కలిసి తనకు మద్దతివ్వాలని రవీందర్ కోరాడు. ఇక బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు వున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవీందర్ వెనకుండి నడిపిస్దున్నది ఈటలే అని రాజకీయంగా చర్చ జరుగుతోంది. 

రవీందర్ సింగ్ తిరుగుబాటు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల అసంతృప్తి నేపథ్యంలో అధికార టీఆర్ఎస్  అలెర్ట్ అయ్యింది. ఓటుహక్కు కలిగిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఇప్పటికే క్యాంప్ కు తరలించారు.  ఈ క్యాంప్ రాజకీయాలు ఎన్నిక ముగిసే వరకు కొనసాగనున్నాయి. అప్పటివరకు టీఆర్ఎస్ ప్రజానిధులు హైదరాబాద్ శివారులోని వివిధ రిసార్టుల్లో ఏర్పాటుచేసిన క్యాంపుల్లో వుండనున్నారు. 

read more  నన్ను కోవర్ట్ అంటారా... రోజుకొక బండారం బయటపెడతా : కేసీఆర్‌కు రవీందర్ సింగ్ వార్నింగ్

ఇక ఇప్పటికే మొత్తం 12స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే ఆరు ఏకగ్రీవం కాగా మరో ఆరుచోట్ల ఎన్నిక తప్పడం లేదు. నిజామాబాద్ నుండి ఎమ్మెల్సి కవిత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి  సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, వరంగల్ నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఇక Karimnagar జిల్లాలో టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ తో పాటు హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో టిడిపిని వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎల్.రమణ పోటీ చేస్తున్నారు.  ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి దండే విఠల్,  ఖమ్మం నుండి తాతా మధు, మెదక్ నుండి యాదవరెడ్డి, నల్గొండ నుండి ఎంసీ కోటిరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలవడంతో ఎన్నిక అనివార్యమయ్యింది. 

 

click me!