Mariyamma death case: మరియమ్మ మృతిపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు.. తీర్పు వెలువరించిన హైకోర్టు..

Published : Nov 29, 2021, 11:44 AM IST
Mariyamma death case: మరియమ్మ మృతిపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు.. తీర్పు వెలువరించిన హైకోర్టు..

సారాంశం

మరియమ్మ లాకప్ డెత్‌ (mariyamma lockup death) కేసులో తెలంగాణ హైకోర్టు (Telangana High court ) నేడు తీర్పును వెలువరించింది. మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది.  

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ (mariyamma) మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మరియమ్మ లాకప్ డెత్‌పై (mariyamma lockup death) హైకోర్టులో పీయూసీఎల్ పిల్‌ దాఖలు చేసింది.  ఈ పిల్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు (Telangana High court ) నేడు తీర్పును వెలువరించింది. మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మేజిస్ట్రేట్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేయాలని సూచించింది. తార్కిక ముగింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు ప్రస్తుత దశలో ఎలాంటి చర్యలు అవసరం లేదని పేర్కొంది. పీయూసీఎల్ దాఖలు చేసిన పిల్‌పై విచారణను హైకోర్టు ముగించింది. 

ఇక, ఖమ్మం జిల్లా (khammam district) చింతకాని (chintakani) సమీపంలోని కోమట్లగూడెం గ్రామానికి చెందిన మరియమ్మ ఆమె కొడుకు ఉదయ్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చర్చిలో పనిచేసేవారు. అయితే చర్చిలో పనిచేసే సమయంలో  డబ్బులు పోయాయని చర్చి ఫాదర్  ఫిర్యాదు మేరకు  ఈ ఏడాది జూన్ 18వ తేదీన  ఉదయం 7:45 గంటలకు మరియమ్మతో పాటు ఆమె కొడుకు ఉదయ్, అతని స్నేహితుడు శంకర్ లను అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు.

Also read: మరియమ్మ లాకప్‌డెత్ కేసు: గుండె ఆగిపోయేలా కొడతారా... సీబీఐ దిగాల్సిందే, తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు

అయితే పోలీసులు కొట్టిన దెబ్బలకు తన తల్లి మరియమ్మ తన చేతుల్లోనే చనిపోయిందని ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో డీజీపికి ఈ విషయాన్ని ఉదయ్ తెలిపారు. మరియమ్మ పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌పై వేటుపడింది.

ఈ క్రమంలోనే హైకోర్టులో పిల్ దాఖలు కాగా.. సుధీర్ఘ విచారణ కొనసాగింది. ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐ, కానిస్టేబుల్‌లను విధుల నుంచి తొలగించినట్లు ఏజీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం బాధ్యులైన క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించింది. అయితే ఏజీ స్పందిస్తూ.. మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించినట్లు కోర్టుకు తెలిపారు. పరిహారం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని ఏజీ కోర్టుకు తెలిపారు. రెండో పోస్ట్‌మార్టం (postmortem) నివేదికలో మరియమ్మపై గాయాలున్నాయని న్యాయస్థానం వెల్లడించింది. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు