సెక్రటేరియట్ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల యత్నం: అరెస్ట్ చేసిన పోలీసులు

By narsimha lodeFirst Published Dec 28, 2021, 12:39 PM IST
Highlights

317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సచివాలయం ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయ సంఘాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను  సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

హైదరాబాద్: 317 జీవోను సవరించాలనే డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు Telangana secretariat  ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం  ఇటీవల జారీ చేసిన  జీవో 317ను  సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  317 జీవో కారణంగా సుమారు 25 వేల మంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయే పరిస్థితి నెలకొందని Teachers union  నేతలు ఆరోపిస్తున్నారు.

also read:ఉద్యోగుల జీవితాల్లో మట్టికొట్టొద్దు: కేసీఆర్ పై ఈటల రాజేందర్ ఫైర్

317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ  ఉపాధ్యాయ సంఘాల నేతలు మంగళవారం నాడు చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. అయితే సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయ సంఘాల నేతలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అడ్డుకొని సచివాలయం వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయ సంఘాల నేతలను అరెస్ట్ చేశారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాన్‌ లోకల్‌ అభ్యర్థులు 5 శాతం మించి ఉద్యోగాలు పొందడానికి అవకాశం లేనప్పటికీ, దానికి భిన్నంగా కేటాయింపులను జరుపుతున్నారని ఉపాధ్యా సంఘాలు  ఆరోపింస్తున్నాయి. 317 జీవోను రద్దు చేసి ఖాళీగా ఉన్న 75 శాతం పోస్టులను నిరుద్యోగ యువతతో భర్తీ చేయాలని కోరుతున్నారు.

ఉపాధ్యాయులు పాఠశాలలను ఎంపిక చేసుకునే విషయంలో ప్రభుత్వం ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ను రద్దు చేసి, వెబ్‌ కౌన్సెలింగ్‌ను చేపట్టడం పట్ల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్షన్‌ ఫాం అవసరం లేదని చెప్పిన అధికారులు సోమవారం రాత్రి వరకు వాటిని సమర్పించాలని ఆదేశించడం సరికాదని పేర్కొంది. ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఇవాళ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ  సెక్రటేరియట్ ను చేపట్టాయి.

 మరో వైపు జిల్లా, జోన్‌, మల్టీజోన్‌ కేటాయింపులు చేయడం వల్ల తాము స్థానికత కోల్పోతున్నామని పంచాయతీ కార్యదర్శుల సంఘం ఒక ప్రకటనలో ఆరోపించింది. గ్రేడ్‌-1, 2, 3జోనల్‌ పోస్టులకు సంబంధించి కేటాయింపులు చేస్తూ మొబైల్‌ సందేశంలో ఉత్తర్వులు వచ్చాయని తెలిపింది. మూడు రోజుల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నట్లు తెలిపింది. ఇది జోనల్‌ స్ఫూర్తికి విరుద్ధమని స్థానికత కోల్పోయిన పంచాయతీ కార్యదర్శులతో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని పేర్కొంది.

317 జీవో ప్రకారంగా బదిలీలు జరిగితే జూనియర్ టీచర్లు శాశ్వతంగా ఇతర జిల్లాల్లోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు.సీనియారిటీ ప్రక్రియ సరిగా లేదని  ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయమై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.317 జీవోను నిరసిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలు దశలవారీగా ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు.

click me!