2021 Crime Roundup: భారీగా పెరిగిన క్రైమ్ రేట్... మహిళలపై అత్యాచారాలు కూడా..: రాచకొండ సిపి వెల్లడి

By Arun Kumar PFirst Published Dec 28, 2021, 11:11 AM IST
Highlights

ఈ ఏడాది రాచకొండ కమీషనరేట్ పరిధిలో మహిళలపై అఘాయిత్యాలు, సైబర్ నేరాలు, క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయిందని పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) పరిధిలోని రాచకొండ కమీషనరేట్ (Rachakonda Police Commissionerate) లో ఈ ఏడాది నేరాలు పెరిగాయని పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ (mahesh bhagawath) వెల్లడించారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ (cyber crime), మహిళలపై అఘాయిత్యా (women harassment)లు గతేడాదితో పోలీస్తే భారీగా పెరిగాయని సిపి ఆందోళన వ్యక్తం చేసారు. పోలీస్ సిబ్బంది నిబద్దతతో నిత్యం నేరాల నియంత్రన, శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతున్నారని సిపి భగవత్ పేర్కొన్నారు. 

రాచకొండ కమీషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ (crime rate) 9శాతం పెరిగినట్లు సిపి వెల్లడించారు. సాధారణ నేరాల కంటే సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 123శాతం సైబర్ క్రైమ్ పెరిగిందని సిపి తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసులకు సాంకేతికతపై ప్రత్యేక అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇక మహిళల రక్షణ విషయానికి వస్తే అమ్మాయిలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు పెరిగాయని సిపి తెలిపారు. మహిళల కిడ్నాప్  కేసులు కూడా ఎక్కువయ్యాయని వెల్లడించారు.  రాచకొండ పరిధిలో మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించి 377మంది నిందితులకు అరెస్ట్ చేసామని... అందులో 368మంది బాధితులకు తెలిసినవారేనని  పేర్కొన్నారు. అంటే తెలిసినవారి నుండే మహిళలు ఎక్కువగా వేధింపులకు ఎదుర్కొంటున్నట్లు సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. 

read more  Niti Ayog Report : ఆ రంగంలో.. తెలంగాణ‌ 3వ స్థానం.. ఏపీ 4వ స్థానం

మహిళల అక్రమ రవాణా (Human Trafficking)ను కూడా సమర్ధవంతంగా అడ్డుకోగలిగినట్లు కమీషనర్ తెలిపారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో 249మంది మహిళలను అక్రమ రవాణా నుండి కాపాడినట్లు వెల్లడించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్స్ 198మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిపి వెల్లడించారు. 

మొత్తంగా గతేడాది కరోనా వ్యాప్తి (corona outbreak), లాక్ డౌన్ (lock down) కారణంగా ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడంతో నేరాల శాతం తగ్గినట్లు సిపి భగవత్ పేర్కొన్నారు. కానీ ఈ ఏడాది నేరాల శాతం పెరిగిందన్నారు. గతేడాది (2020 సంవత్సరం) 19857 కేసులు నమోదయితే ఈ ఏడాది (2021 సంవత్సరం) లో ఇప్పటివరకు 21,685 కేసులు నమోదైనట్లు సిపి వెల్లడించారు.

read more  ఏపీలో సంచలనంగా మారిన లవ్‌ లైఫ్‌ మోసం.. రీచార్జిల పేరుతో రూ. 200 కోట్ల లూటీ.. ఇంతకీ అనసూయ ఎవరు..?

ఇక నేరాలను అరికట్టడమే కాదు నిందుతులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడంలో రాచకొండ కమీషనరేట్ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందన్నారు.  ఈ ఏడాది వివిధ కేసుల్లో 55 శాతం నిందితులకు కోర్టు శిక్షలు విధించిందని సిపి మహేష్ వెల్లడించారు.

ఇక కేసుల సత్వర పరిష్కారానికి ఈ ఏడాది నాలుగుసార్లు లోక్ అదాలత్ ఏర్పాటుచేసినట్లు మహేష్ భగవత్ తెలిపారు. ఈ క్రమంలో 8836 కేసులను పరిష్కరించి తెలంగాణలోనే రాచకొండ కమీషనరేట్ మొదటి స్థానంలో నిలిచినట్లు కమీషనర్ వెల్లడించారు. 
 
 

click me!