హైద్రాబాద్‌ తార్నాకలో దారుణం: లిఫ్టిచ్చి యువతిపై లైంగిక దాడి

Published : Jul 03, 2023, 04:52 PM IST
హైద్రాబాద్‌ తార్నాకలో దారుణం: లిఫ్టిచ్చి యువతిపై   లైంగిక దాడి

సారాంశం

హైద్రాబాద్ తార్నాకలో దారుణం  చోటు  చేసుకుంది.  లిఫ్ట్ పేరుతో యువతిపై  లైంగిక దాడికి దిగాడు యువకుడు. 

హైదరాబాద్: నగరంలోని తార్నాకలో దారుణం చోటు  చేసుకుంది.  లిఫ్ట్ పేరుతో  యువతిని బైక్ పై ఎక్కించుకొని  లైంగికదాడికి దిగాడు  నిందితుడు.  నిందితుడి నుండి తప్పించుకొనే  క్రమంలో  యువతి  బైక్ పై  నుండి కిందకు దూకింది. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న లారీ యువతిని ఢీకొట్టింది.  దీంతో  యువతి తీవ్రంగా గాయపడింది.  ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు  యువతిని  ఆసుపత్రికి తరలించారు.  

యువతి  ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతుంది.   జూన్  26వ తేదీన  ఈ ఘటన  జరిగింది. కానీ ఆలస్యంగా  ఈ విషయం వెలుగు చూసింది.   సంఘటన జరిగిన  తర్వాత యువతి స్పృహ కోల్పోయింది.  యువతి స్పృహాలోకి వచ్చిన తర్వాత  తన  కుటుంబ సభ్యుల  వివరాలను  పోలీసులకు  అందించింది.  ఈ సమాచారాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందించారు.   బాధిత యువతి  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  ఉస్మానియా యూనివర్శిటీ  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  

జూన్  26న  రాత్రి  పదకొండు  గంటల సమయంలో  బాధిత యువతి   తార్నాకలో  ఓ యువకుడిని  లిఫ్ట్ అడిగింది.  యువతిని  లిఫ్ట్ ఇచ్చిన యువకుడు  యువతిపై  లైంగిక దాడికి యత్నించాడు.  మరో రూట్ లో  బైక్ ను మళ్లించే  ప్రయత్నించాడు.  ఈ విషయాన్ని గుర్తించిన  యువతి బైక్ పై నుండి దూకేసింది. అదే సమయంలో  వెనుక నుండి వచ్చిన  లారీ  యువతిని ఢీకొట్టింది. బాధిత కుటుంబం ఫిర్యాదు  మేరకు  పోలీసులు  ఈ ప్రాంతంలో సీసీటీవీ పుటేజీ ఆధారంగా  దర్యాప్తు  చేశారు.  ఈ దర్యాప్తులో  నిందితుడిని  గుర్తించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu
Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?