తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.
హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు న్యూఢిల్లీకి వెళ్లారు. పార్టీలో పదవుల కోసం పార్టీ అగ్రనేతలను కలిసేందుకు రఘునందన్ రావు న్యూఢిల్లీకి చేరుకున్నారు పార్టీని బలోపేతం కోసం పనిచేస్తున్న తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని రఘునందన్ రావు కోరుతున్నారు. మూడు పదవుల్లో ఏదో ఒక పదవిని ఇవ్వాలని రఘునందన్ రావు కోరుతున్నారు. పార్టీలో పదేళ్ల నుండి తాను పనిచేస్తున్నానని రఘునందన్ రావు చెబుతున్నారు. తనకు పార్టీలో సుముచిత స్థానం ఇవ్వాలని పార్టీ అగ్రనేతలను రఘునందన్ రావు కోరుతున్నారు.
పార్టీలో తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందని రఘునందన్ రావు అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ తెలంగాణ నాయకత్వంలో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో రఘునందన్ రావు న్యూఢిల్లీలో బీజేపీ నేతలను కలిసేందుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ అసెంబ్లీ శాసనసభపక్ష నేత పదవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పదవిని రఘునందన్ రావు ఆశిస్తున్నారు. ఈ మూడు పదవుల్లో ఏదో ఒక పదవిని రఘునందన్ రావు కోరుతున్నారు. రఘునందన్ రావుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా రఘునందన్ రావుకు జితేందర్ రెడ్డి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలిపారు.
బీజేపీ శాసనసభపక్ష నేతగా ఉన్న రాజాసింగ్ పై ఆ పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఇంకా ఎత్తివేయలేదు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభపక్ష పదవిపై రఘునందన్ రావు ఆసక్తిని చూపుతున్నారు.
also read:మరోసారి బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్: రఘునందన్ రావుకు మద్దతు
రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పిస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో బీజేపీ అధ్యక్ష పదవికి తాను కూడ అర్హుడినేనని రఘునందన్ రావు చెబుతున్నారు. త్వరలో జరిగే ఎన్నికలను పురస్కరించుకొని బీజేపీలో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో రఘునందన్ రావు తన అభిప్రాయాలను పార్టీ జాతీయ నాయకత్వం ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చారు.