వికారాబాద్ కాలాపూర్ లో శిరీష మృతి: బావ హత్య చేసినట్టుగా పోలీసుల నిర్ధారణ

By narsimha lode  |  First Published Jun 14, 2023, 11:31 AM IST

వికారాబాద్  జిల్లా కాలాపూర్ లో   శిరీష అనే యువతి మృతికి  ఆమె బావ  అనిల్ కారణమని  పోలీసులు నిర్ధారించారు.  అనిల్ కు సహకరించిన  రాజు అనే వ్యక్తిని కూడ పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.


హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కాలాపూర్ లో  శిరీష అనే యువతిని  ఆమె బావ అనిల్ హత్య  చేసినట్టుగా  పోలీసులు  నిర్ధారించారు.  శిరీష  భావ అనిల్ కు  సహకరించిన  రాజు అనే వ్యక్తిని కూడ  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ నెల  10వ తేదీన  రాత్రి శిరీష  నీటి కుంటలో  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది .ఈ నెల  11 వ తేదీన నీటి కుంటలో  శిరీష  మృతదేహం బయట పడింది.  

శిరీష ఆత్మహత్య  చేసుకుందా.  హత్య జరిగిందా  అనే విషయమై  పోలీసులు నాలుగు రోజులుగా విచారణ  చేస్తున్నారు. అయితే  శిరీష  మృతికి  ఆమె బావ  అనిల్ కారణమని  పోలీసులు  నిర్ధారించారు.ఈ నెల  10వ తేదీన  మొబైల్ ఫోన్  విషయమై  శిరీష  తండ్రి, బావ అనిల్ లు   శిరీషను  కొట్టారు.  దీంతో శిరీష  ఇంట్లోనే  ఆత్మహత్యాయత్నం  చేసింది.  ఈ విషయాన్ని గుర్తించిన  సోదరుడు, బావ  అనిల్ ఆమెను రక్షించారు

Latest Videos

undefined

. అదే  రోజు  రాత్రి  సమయంలో  శిరీష  ఇంటి నుండి  బయలకు  వెళ్లింది. అదే సమయంలో  శిరీష బావ అనిల్ మద్యం మత్తులో  ఇంటి వైపునకు వస్తున్నాడు. ఆ సమయంలో శిరీషను చూసిన  అనిల్   శిరీష పై చేయిచేసుకున్నాడు. చెప్పిన మాట వినడం లేదని  శిరీషపై దాడి చేశారు.  బీరు సీసాతో  శిరీష కళ్లపై దాడి  చేశారు.  అనంతరం  నీటి కుంటలో  శిరీషను  వేశారు. ఈ సమయంలో  అనిల్ కు  రాజు అనే వ్యక్తి సహయపడ్డాడు.  వీరిద్దరిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

also read:శిరీష ఫోన్ డేటా విశ్లేషిస్తున్నాం: వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి

శిరీష  అనుమానాస్పద  మృతి విషయమై  గ్రామస్తులు  పెద్ద ఎత్తున ఆందోళన  నిర్వహించారు.  శిరీష కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం  చేశారు.    శిరీష బావను  పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. శిరీష తండ్రిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.   శిరీష ఫోన్ ను కూడ పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. శిరీష  మొబైల్ డేటాను  విశ్లేషించారు. మరో వైపు శిరీష డెడ్ బాడీకి  రెండు దఫాలు  పోస్టుమార్టం నిర్వహించారు.   చివరికి  శిరీష మృతికి బావ అనిల్ కారణమని పోలీసులు  నిర్ధారించారు.

click me!