హైద్రాబాద్ లో ఐటీ సోదాల కలకలం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో సోదాలు

By narsimha lode  |  First Published Jun 14, 2023, 10:29 AM IST

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి  నివాసంలో  ఇవాళ  ఉదయం నుండి  ఐటీ అధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు. 



హైదరాబాద్:  బీఆర్ఎస్ కు చెందిన  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి నివాసంలో  బుధవారంనాడు ఉదయం నుండి  ఐటీ అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు.హైద్రాబాద్ లోని కేపీహెచ్‌బీలోని  మర్రి జనార్ధన్ రెడ్డి నివాసంలో  ఇవాళ  ఉదయం నుండి  ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు  చేస్తున్నారు. మర్రి జనార్ధన్ రెడ్డి  వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.  మర్రి జనార్ధన్ రెడ్డి కి చెందిన  బట్టల షోరూమ్ లలో కూడ  ఐటీ అధికారులు  సోదాలు  చేస్తున్నారు.   హైద్రాబాద్ నగరంలో  పలు  బట్టల  షోరూమ్ లలో  ఆదా య పన్ను శాఖాధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు.  మర్రి జనార్ధన్ రెడ్డికి జేసీ బ్రదర్స్ తో పాటు   మరికొన్ని వస్త్రాల  దుకాణాలున్నాయి. 

 రాజకీయాల్లోకి రాకముందు నుండి   మర్రి జనార్ధన్ రెడ్డి  జేసీ బ్రదర్స్ బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. జేసీ బ్రదర్స్ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలను  మర్రి జనార్ధన్ రెడ్డి నిర్వహిస్తున్నారని సమాచారం.   మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన  వస్త్ర దుకాణాలపై ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Latest Videos

ఇవాళ ఉదయం నుండి  బీఆర్ఎస్ కు చెందిన  ముగ్గురు  ప్రజా ప్రతినిధుల ఇళ్లలో  ఐటీ అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి,  మెదక్ ఎంపీ  కొత్త ప్రభాకర్ రెడ్డి  నివాసంలో కూడ  సోదాలు  నిర్వహిస్తున్నారు. మరో వైపు  నాగర్ కర్నూల్   ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి  నివాసంలో సోదాలు  నిర్వహిస్తున్నారు.

also read:బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు

ఆదాయపన్ను రిటర్న్స్ , జీఎస్ టీ  విషయమై  అనుమానాలతో  ఐటీ అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారని  ప్రచారం సాగుతుంది.  ఇప్పటికే  భువనగిరి ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డికి  నివాసంలో  సోదాలు నిర్వహించిన సమయంలో  కొన్ని పత్రాలను  ఐటీ అధికారులు  తీసుకెళ్లారని  సమాచారం.బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు చెందిన నివాసాల్లో  సోదాల  సమయంలో   ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు  చోటు  చేసుకోకుండా ఉండేందుకు గాను  కేంద్ర బలగాలు బందోబస్తు  నిర్వహించారు. 


 

click me!