రైలులో పరిచయం... ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి..

Published : Jan 20, 2020, 02:12 PM IST
రైలులో పరిచయం... ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి..

సారాంశం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేసింది. శనివారం రాత్రి 10.30గంటల సమయంలో తన స్నేహితుడు రాజుతో కలిసి వివేకానంద సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆ యువతిని కారులో ఎక్కించుకున్నాడు.

రైలులో పరిచయమయ్యాడు. ఆమె అవసరాన్ని గుర్తించాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు.  అతని మాటలు ఆమె నిజమేనని అనుకుంది. తీరా అదును చూసుకొని సదరు యువతిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంగటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....మహారాష్ట్ర బుసావాల్ కి చెందిన ఓ యువతి(24) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. చర్లపల్లి రైల్వే కాలనీకి చెందిన వివేకానంద(42) రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతను పనిమీద ప్రతి 15 రోజుకు ఒకసారి మహారాష్ట్ర వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో అతనికి సదరు యువతి పరిచయమైంది.

తాను ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు ఆమె చెప్పడంతో...త ాను ఇప్పిస్తానని... హైదరాబాద్ రావాలని చెప్పాడు. అతను చెప్పిన మాటలను సదరు యువతి నిజమని నమ్మేసింది. సదరు యువతి ఈ నెల 18వ తేదీన ఉదయం మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్ కి చేరుకుంది.  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేసింది. శనివారం రాత్రి 10.30గంటల సమయంలో తన స్నేహితుడు రాజుతో కలిసి వివేకానంద సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆ యువతిని కారులో ఎక్కించుకున్నాడు.

Also Read పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను తల్లిని చేశాడు...

కారులోనే స్నేహితుడితో కలిసి మద్యం సేవించాడు. యువతికి బలవంతంగా మత్తుమందు కలిపిన కొన్ని పదార్ధాలను తినిపించారు. మత్తులోకి జారుకున్న మహిళను ఓ హోటల్ కి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా.... తనపై జరిగిన దారుణాన్ని మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తించిన యువతి... ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అతని స్నేహితుడిని అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో బైక్ ఉంటే చాలు... నెలనెలా ఈజీగా రూ.60,000 సంపాదించవచ్చు
Kabaddi Match: స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి కబడ్డీ ఆటకు రేవంత్ రెడ్డి ఫిదా | Asianet News Telugu