కేటీఆర్ ఆస్తులపై విచారణ.. రేవంత్ తప్పు చేశాడంటున్న వీహెచ్

By telugu teamFirst Published Jan 20, 2020, 10:51 AM IST
Highlights

కేటీఆర్ ఆస్తులపై విచారణ చేయించాలని రేవంత్ అనుకోవడం మంచిదేగానీ.. లేఖ రాంగ్ పర్సన్ కి రాశారని ఆయన అన్నారు. కేటీఆర్‌ ఆస్తులపై కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాయాల్సిందని చెప్పారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య సంబంధాలు కూడా బయటపడేవని వీహెచ్‌ అన్నారు.

కేటీఆర్ ఆస్తులపై విచారణ చేయించాలని ఎంపీ రేవంత్ రెడ్డికి వచ్చిన ఆలోచన మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. మంత్రి కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలనంటూ ఇటీవల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. కాగా... దీనిపై తాజాగా వీహెచ్ స్పందించారు.

కేటీఆర్ ఆస్తులపై విచారణ చేయించాలని రేవంత్ అనుకోవడం మంచిదేగానీ.. లేఖ రాంగ్ పర్సన్ కి రాశారని ఆయన అన్నారు. కేటీఆర్‌ ఆస్తులపై కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాయాల్సిందని చెప్పారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య సంబంధాలు కూడా బయటపడేవని వీహెచ్‌ అన్నారు.

Also Read రాజకోట రహస్యం ఏమిటి: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ...
 
‘‘అవినీతికి పాల్పడితే సొంత కుమారుడు, కుమార్తెనైనా కటకటాలు లెక్కపెట్టిస్తానని గతంలో మీరు ప్రకటించారు. దానికి కట్టుబడి మీ కుమారుని ఆస్తులు, అక్రమాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణకు ఆదేశించండి’’ అని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్‌ అవినీతిపై కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. ఆరేళ్లుగా కేసీఆర్‌ కుటుంబం చేస్తున్న దోపిడీపై సమగ్ర వివరాలు, ఆధారాలతో పుస్తక రూపంలో తెలంగాణ సమాజం ముందు ఉంచుతామని పేర్కొంటూ శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

click me!