నిండు గర్భిణి దారుణ హత్య: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పనే

Published : Aug 27, 2020, 09:16 AM ISTUpdated : Aug 27, 2020, 09:25 AM IST
నిండు గర్భిణి దారుణ హత్య: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పనే

సారాంశం

గౌతమ్ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు.దీంతో.. మద్యం కోసం భార్యను డబ్బులు ఇవ్వమని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది


ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. అతని ప్రేమను ఆమె కూడా అంగీకరించింది. దీంతో.. వారిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.  కాగా.. భిక్షాటన చేస్తూ.. చెత్త కాగితాలు ఏరుతూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవించేవారు. హాయిగా జీవితం సాగిపోతుందనుకునే సమయానికి వారి మధ్య మద్యం మహమ్మారి చిచ్చుపెట్టింది. ఈ క్రమంలో ప్రేమించి పెళ్లాడిన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన  సికింద్రాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు వివరించారు. తుకారాంగేట్ కు చెందిన గౌతమ్ కుమార్(24), లాలాగూడకు చెందిన మహాలక్ష్మి(20)లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాది వయసు కొడుకు ఉన్నాడు. కాగా.. ఆమె ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. గాంధీ ఆస్పత్రి బయట ఉన్న ఫుట్ పాత్ పై వీరు నివసించేవారు.

కాగా.. గౌతమ్ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు.దీంతో.. మద్యం కోసం భార్యను డబ్బులు ఇవ్వమని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్య కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా.. కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం