తెలంగాణలో కరోనా విజృంభణ: లక్షా 14 వేలు దాటిన కేసులు

Published : Aug 27, 2020, 08:54 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ: లక్షా 14 వేలు దాటిన కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 14 వేలు దాటింది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో యథావిధిగానే కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2795 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 14 వేల 483కు చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కోవిడ్ వ్యాధితో 8 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 788కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వ్యాధి నుంచి 872 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దాంతో ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 86095కు చేరుకుంది. తెలంగాణలో ఇంకా 27,600 యాక్టివ్ కేసులున్నాయి. 

హైదరాబాదు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 449 కేసులు నమోదు కాగా, నల్లగొండ జిల్లాలో 164 కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 268 కేసులు నమోద్యయాయి. సిద్ధిపేట జిల్లాలోనూ కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో గత 24 గంటల్లో 113 కేసులు నమోదయ్యాయి. 

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కేసులు

ఆదిలాబాద్ 31
భద్రాద్రి కొత్తగూడెం 72
జిహెచ్ఎంసీ 449
జగిత్యాల 89
జనగామ 42
జయశంకర్ భూపాలపల్లి 26
జోగులాంబ గద్వాల 31
కామారెడ్డి 55
కరీంనగర్ 136
ఖమ్మం 152
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 17
మహబూబ్ నగర్ 45
మహబూబాబాద్ 102 
మంచిర్యాల 106
మెదక్ 41
మేడ్చెల్ మల్కాజిగిరి 113
ములుగు 26
నాగర్ కర్నూలు 40
నల్లగొండ 164
నారాయమపేట 24
నిర్మల్ 25
నిజామాబాద్ 112
పెద్దపల్లి 77
రాజన్న సిరిసిల్ల 32
రంగారెడ్డి 268
సంగారెడ్డి 34
సిద్ధిపేట 113
సూర్యాపేట 86
వికారాబాద్ 27
వనపర్తి 55
వరంగల్ రూరల్ 34
వరంగల్ అర్బన్ 132
యాదాద్రి భువనగిరి 39
మొత్తం కేసులు 2795

 

PREV
click me!

Recommended Stories

Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu
Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?