మైనర్ బాలికను కిడ్నాప్ చేసి... బలవంతంగా పెళ్లి..

By telugu news team  |  First Published Mar 2, 2020, 8:32 AM IST

గతేడాది సెప్టెంబర్ లో బాలిక కనిపించకుండా పోవడం గమనార్హం. కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు.
 



మైనర్ బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను బలవంతంగా రెండో పెళ్లి చేసుకొని గుజరాత్ తీసుకువెళ్లాడు. కాగా... ఈ కేసును ఫలక్ నుమా పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫలక్ నుమా అమ్జదుల్లాబాగ్ కి చెందిన మైనర్ బాలిక(14) ఇటీవల కనిపించకుండాపోయింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది సెప్టెంబర్ లో బాలిక కనిపించకుండా పోవడం గమనార్హం. కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు.

Latest Videos

Also Read హైద్రాబాద్‌లో అరబ్ షేక్‌కు యువతి విక్రయం: మహిళపై లైంగికదాడి, చిత్రహింసలు...

వారి దర్యాప్తులో బిహార్ కి చెందిన అజయ్ పాశ్వాన్(20) బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. బాలికను బలవంతంగాపెళ్లి కూడా చేసుకున్నట్లు తెలిసింది.  దీంతో ఫలక్ నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, ఫలక్ నుమా ఇన్ స్పె్టర్ చంద్రకుమారుల ఆధ్వర్యంలో ఓ బృందం బిహార్ వెళ్లి అక్కడ అజయ్ పాశ్వాన్ ని అదుపులోకి తీసుకుంది.

బాలిక గుజరాత్ లో ఉన్నట్లు తెలుసుకొని  కిడ్నాపర్ చెర నుంచి విడిపించారు. బాలికకు మాయమాటలు చెప్పి గుజరాత్ తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి అప్పటికే ఒక వివాహమైందని.. బాలికను రెండో వివాహం చేసుకున్నాడని అన్నారు. కేసును చేధించిన పోలీసులు బాలికను కటుంబసబ్యులకు అప్పగించారు. 

click me!