హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. యువకుడిపై ఫైరింగ్.. ఒకరు దుర్మరణం

By Mahesh K  |  First Published Apr 5, 2023, 6:05 AM IST

హైదరాబాద్‌లో ఫైరింగ్ కలకలం రేపింది. టప్పాచబుత్రాలో ఓ యువకుడిపై పాయింట్ల బ్లాంక్ రేంజ్‌లో కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 ఏళ్ల యువకుడు స్పాట్‌లోనే మరణించాడు.
 


హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. హైదరాబాద్‌లోని టప్పాచబుత్రాలో ఓ యువకుడిని టార్గెట్ చేసుకుని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ ఫైరింగ్ జరిగింది. 26ఏళ్ల ఆకాశ్ సింగ్ అనే కుర్రాడిపై కొందరు గుర్తు తెలియని దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లు ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్‌లో ఆకాశ్ స్పాట్‌లోనే డెడ్ అయ్యడు. 

ఈ విషయం గురించి తెలియగానే పోలీసులు వెంటనే స్పాట్‌కు వచ్చారు. ఈ కాల్పులు పాత కక్షలతోనే జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్పాట్‌లో పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అనంతరం, డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించడానికి ఉస్మానియా హాస్పిటల్‌కు పంపించారు.

Latest Videos

Also Read: టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్టు.. ఉద్రిక్తతలు

పోలీసులు కేసు ఫైల్ చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఓ బీజేపీ నేతకు బంధువనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఖరారు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.

click me!