టెన్త్ కొశ్చన్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌లోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లి సంజయ్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కావడం దుమారం రేపింది. ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసానికి పోలీసులు వెళ్లారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బండి సంజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు చివరకు బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. పోలీసు వాహనం మొరాయించడంతో మరో వాహనంలో ఆయనను హైదరాబాద్ వైపుగా తీసుకెళ్లుతున్నారు. కాగా, బండి సంజయ్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
undefined
మంగళవారం నాడు టెన్త్ హిందీ పేపర్ కాపీ బయటకు వచ్చింది. ఈ కేసులో ముఖ్యనిందితుడు బండి సంజయ్‌కు సన్నిహితుడు అని అధికార పార్టీ బీఆర్ఎస్ ఆరోపించారు. ఆ లీక్ అయిన కొశ్చన్ పేపర్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా చేరిందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.
Also Read: తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి సన్నద్ధత.. ఏర్పాట్లు సమీక్షించిన సీఎం కేసీఆర్
పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9.45 గంటలకు ఈ కొశ్చన్ పేపర్‌ను ఫొటో తీసినట్టు ఆయన వివరించారు. 11.24 గంటలకు బండి సంజయ్ ఫోన్‌కు ఆ పేపర్‌ను పంపించారని తెలిపారు. పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీ రాజకీయంగానూ దుమారం రేపుతున్నది.