తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి సన్నద్ధత.. ఏర్పాట్లు సమీక్షించిన సీఎం కేసీఆర్

By Mahesh K  |  First Published Apr 4, 2023, 11:44 PM IST

తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నెల 30న జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం కేసీఆర్ ఈ రోజు సమీక్షించారు. సెక్రెటేరియట్ కాంప్లెక్స్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ రూపొందించాలని డీజీపీ అజంనీ కుమార్‌ను ఆదేశించారు.


హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని ఈ నెల 30వ తేదీన ప్రారంభించడానికి ముహూర్తం ఖరారైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. అధికారులు ఈ పనుల్లో తలమునకలయ్యారు. అన్ని ఏర్పాట్లతోపాటు సెక్యూరిటీ పైనా ఫోకస్ పెట్టారు. ఈ రోజు (మంగళవారం) ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ సమీక్షించారు. సెక్యూరిటీ కాంప్లెక్స్ కోసం సెక్యూరిటీ గైడ్‌లైన్స్ రూపొందించాలని డీజీసీ అంజనీ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆ రోజు ఉదయం పూట నిర్వహించే క్రతువుల్లో పాల్గొంటారు. ముహూర్తం, దాని షెడ్యూల్‌ను పండితులు ఖరారు చేస్తారు.

Latest Videos

సాధారణ ప్రారంభ కార్యక్రమం తర్వాత సీఎం ఆయన చాంబర్‌కు వెళతారు. ఆయన సీటులో కూర్చుంటారు. అదే విధానాన్ని మంత్రులు, సెక్రెటరీలు, సీఎంవో సిబ్బంది, డిపార్ట్‌మెంటల్ స్టాఫ్ కూడా పాటిస్తారు.

కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి సుమారు 2,500 మంది హాజరు కానున్నారు. కొత్త సెక్రెటేరియట్ కాంప్లెక్స్‌కు నాలుగు ఎంట్రెన్స్‌లు ఉంటాయి. సీఎం, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర వీఐపీలు, విదేశాల నుంచి వచ్చే ప్రత్యేక ఆహ్వానితులు తూర్పు ఎంట్రెన్స్ (ఇదే మెయిన్ ఎంట్రెన్స్) నుంచి వస్తారు.

Also Read: నూతన సచివాలయ అందాలు కనువిందు... త్రీడి లో సరికొత్త సొగసులు చూడండి..!

కాగా, నార్త్ వెస్ట్ ఎంట్రెన్స్ ఎప్పుడైనా అవసరం పడితే ఓపెన్ చేస్తారు. సచివాలయ సిబ్బంది, అధికారులు, సీనియర్ అధికారులు నార్త్ ఈస్ట్ ద్వారం గుండా వచ్చిపోతారు. పార్కింగ్ కూడా ఇటు వైపుగానే ఉంటుంది. కాగా, సందర్శకులకు సౌత్ ఈస్ట్ ద్వారం గుండా అనుమతి ఉంటుంది. ఈ సందర్శనకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఎలక్ట్రిక్ వెహికిల్స్ అందుబాటులో ఉంటాయి.

click me!